యాప్నగరం

రూ.25,000 నుంచి రూ.2 లక్షల వరకు రుణం.. ఎలాంటి గ్యారంటీ లేకుండానే..!

Flipkart Big Billion Day | దసరా, దీపావళి వంటి రెండు పెద్ద పండుగలు రాబోతున్నాయి. కచ్చితంగా షాపింగ్ చేయాల్సి వస్తుంది. కొత్త ప్రొడక్టులు కొనాల్సి రావొచ్చు. అందువల్ల డబ్బులు అవసరం పడొచ్చు. సులభంగానే రూ.2 లక్షల వరకు రుణం పొందే అవకాశం అందుబాటులో ఉంది.

Samayam Telugu 18 Sep 2019, 11:54 am

ప్రధానాంశాలు:

  • పండుగ సీజన్ వస్తోంది.. డబ్బులు అవసరం కావొచ్చు
  • బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు కాకుండానే పీ2పీ ప్లాట్‌ఫామ్స్‌పై కూడా రుణం పొందొచ్చు
  • అది కూడా త్వరితగతిన తక్కువ వడ్డీ రేటుకే
  • రూ.2 లక్షల వరకు రుణ సౌకర్యం

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu PERSONAL LOAN
పండుగ సీజన్ వచ్చేస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలు ఇప్పటికే మెగా ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. దసరా, దీపావళి వచ్చాయంటే ఖర్చులు పెరుగుతాయి. షాపింగ చేయాల్సి ఉంటుంది. దీంతో డబ్బులు అవసరం పడొచ్చు.
చాలా మంది ఇప్పుడు క్రెడిట్ కార్డులతో షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారు. తర్వాత బిల్లును కట్టేస్తుంటారు. లేదంటే బిల్లు మొత్తాన్ని ఈఎంఐ రూపంలోని మార్చుకుంటారు. క్రెడిట్ కార్డు వద్దనుకునేవారికి మరో ఆప్షన్ కూడా ఉంది. అదే పీ2పీ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్. వీటి ద్వారా సులభంగానే రుణం పొందొచ్చు.

బ్యాంకులు, ఇతర ఎన్‌బీఎఫ్‌సీలతో పోలిస్తే పీ2పీ ప్లాట్‌ఫామ్‌పై తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు. అది కూడా వేగంగా, సులభంగా లోన్ మంజూరు అవుతుంది. రూపీసర్కిల్, లెన్‌డెన్‌క్లబ్ వంటి వాటిని పీ2పీ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Also Read: undefined

పండుగ సీజన్ నేపథ్యంలో చాలా మందికి వివిధ అవసరాల కోసం డబ్బు అవసరం కావొచ్చని రూపీసర్కిల్ సీఈవో, కో ఫౌండర్ అజిత్ కుమార్ తెలిపారు. తామే తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.25,000 నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి తనాఖా లేకుండా ఆకర్షణీయ వడ్డీరేటుకే త్వరితగతిన రుణం పొందొచ్చని వివరించారు. క్రెడిట్ హిస్టరీ లేని వారు కూడా లోన్ తీసుకోవచ్చని తెలిపారు.

Also Read: undefined

రుణం కోసం దరఖాస్తు చేసుకునే ముందే అర్హత గురించి తెలుసుకోవాలి. పీ2పీ లెండర్స్ వెబ్‌సైట్స్‌కు వెళ్లి రుణ అర్హతలు చూసుకోవచ్చు. అలాగే ఎంత మొత్తం రుణం పొందొచ్చొ తెలుసుకోవచ్చు. తర్వాత పీ2పీ ప్లాట్‌ఫామ్‌పై రిజిస్టర్ చేసుకోవాలి. ఏ రకమైన లోన్ కావాలో ఎంచుకొని, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీరు రుణం మంజూరు అవుతుంది.

Also Read: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? ఈ తప్పులు చేయొద్దు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.