యాప్నగరం

Loan Moratorium Extended: లోన్ తీసుకున్న వారికి శుభవార్త.. మరో మూడు నెలలు ఏం కట్టక్కర్లేదు ?

మరో మూడు నెలల పాటు మారిటోరియం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఎస్బీఐ పరిశోధన నివేదికలో పేర్కొంది. కేంద్రం తాజాగా లాక్ డౌన్‌ను మే 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే.

Samayam Telugu 19 May 2020, 12:55 pm
ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించడంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరో మూడు నెలల పాటు మారిటోరియం పెంచే ఆలోచనలు చేస్తోంది.. రుణాలు తిరిగి చెల్లించడంపై తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించే అవకాశం ఉందని ఎస్‌బిఐ పరిశోధన నివేదికలో తెలిపింది. కేంద్రం తాజాగా లాక్ డౌన్ 4.0ను మే 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవటానికి 21 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. ఇది మొదట మే 3 వరకు ఆతర్వాత మళ్ళీ మే 17 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.
Samayam Telugu rbi


Read more:undefined
అయితే మార్చి మార్చి 1, 2020 , మే 31, 2020 మధ్య చెల్లించాల్సిన అన్ని టర్మ్ లోన్ల చెల్లింపుపై మార్చిలో ఆర్బిఐ మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని అనుమతించింది. అయితే ఇప్పుడు లాక్ డౌన్ మే 31 వరకు పొడిగించడంతో, ఆర్బిఐ తాత్కాలిక నిషేధాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని భావిస్తోంది. దీని ప్రకారం రుణాల చెల్లింపుకు మరో మూడు నెలల మారటోరియం అవకాశం కల్పిస్తోంది. అయితే తాజాగా లాక్ డౌన్ పొడిగించడంతో 2020 ఆగస్టు 31 వరకు కంపెనీలు చెల్లించనవసరం లేదని మరో మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత సెప్టెంబరులో కంపెనీలు చెల్లించాల్సినవి వడ్డీతో కలిపి చెల్లించే అవకాశం కల్పించనున్నాయి.

Read More: undefined
అయితే వడ్డీతో కలిపి లోన్లను తిరిగి చెల్లించడంలో విఫలమైతే, ఆర్బిఐ నిబంధనల ప్రకారం అలాంటి వారి ఖాతాను నిరర్ధక రుణాలుగా వర్గీకరించవచ్చు. అయితే ఆర్బిఐ జూన్ 7న సర్క్యులర్ బ్యాంకులకు పలు సౌలభ్యాన్ని ఇస్తుంది. "సవరించిన పునర్నిర్మాణ నిబంధనలు మార్చి 2021 వరకు వడ్డీ బాధ్యతలను టర్మ్ లోన్లుగా మార్చడం, వర్కింగ్ క్యాపిటల్ కోసం 3-5 సంవత్సరాలలో తిరిగి చెల్లించాల్సినవి మరియు టర్మ్ లోన్ల విషయంలో టేనర్ చివరిలో తిరిగి చెల్లించటం వంటి పునర్నిర్మాణానికి బ్యాంకులకు ఇవ్వాలి" అని ఆర్బీఐ నివేదికలో తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.