యాప్నగరం

దటీజ్ జియో: 6 నెలల్లో 10కోట్లు దాటిన యూజర్లు

ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీకి చెందిన టెలీకాం కంపెనీ రిలయన్స్ జియో తన హావాను కొనసాగిస్తోంది.

TNN 21 Feb 2017, 12:45 pm
ప్రముఖ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీకి చెందిన టెలీకాం కంపెనీ రిలయన్స్ జియో తన హావాను కొనసాగిస్తోంది. ఉచిత వాయిస్, డాటా సర్వీసులతో మార్కెట్‌లోకి వచ్చిన ఈ టెలీకాం సంస్థ 6 నెలల్లోనే 10 కోట్ల సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. సెప్టెంంబర్ 5న అధికారికంగా ‘వెల్‌కమ్ ఆఫర్’ను ప్రకటించిన అంబానీ 90 రోజులపాటు ఉచితంగా అపరిమిత 4జీ వాయిస్, డాటా సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు ప్రకటించారు. ఆ తరవాత జనవరి 1 నుంచి మరోసారి ‘హ్యాపీ న్యూ ఇయర్’ ఆఫర్‌తో మరో మూడు నెలలు అంటే మార్చి 31 వరకు అందిస్తోంది జియో.
Samayam Telugu reliance jio crosses 100 million users in under 6 months
దటీజ్ జియో: 6 నెలల్లో 10కోట్లు దాటిన యూజర్లు


4జీ సేవలు ఉచితంగా అందిస్తుండటంతో అనేక మంది జియోవైపు మొగ్గు చూపారు. దీంతో ఆరు నెలలలోపే జియో యూజర్ల సంఖ్య 10 కోట్లు దాటింది. ఈ విషయాన్ని ముఖేశ్ అంబానీ మంగళవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. 4జీ సేవలను మాత్రమే అందిస్తున్న జియో భవిష్యత్తు ప్రణాళికను కూడా అంబానీ వివరించనున్నట్లు సమాచారం. అయితే ఉచిత ఆఫర్లతో దేశంలో అతిపెద్ద టెలీకాం ఆపరేటర్లయిన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలను ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న జియో.. తన ఉచిత ఆఫర్లను పొడిగిస్తుందా? లేక టారిఫ్ ప్లాన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుందా అని ఆయా కంపెనీలతో పాటు వినియోగదారులు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు.

రిలయన్స్ జియోపై రూ. 1.7 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేసిన అంబానీ మరింత పెట్టుబడి పెట్టేందుకు వెనకాడేదిలేదని ఇప్పటికే స్పష్టం చేసారు. జనవరి రెండో వారంలో జరిగిన కంపెనీ బోర్డు మీటింగ్‌లో కూడా దీనిపైనే చర్చ జరిగింది. కంపెనీ నెట్‌వర్క్‌ను పెంచడానికి, మరింత నాణ్యమైన సేవలు అందించడానికి రూ. 30వేల కోట్లు ఖర్చు చేయాలని బోర్డు మీటింగ్‌లో నిర్ణయించారు. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసారు. కాబట్టి రిలయన్స్ జియో విషయంలో అంబానీ ఎంత పగడ్బంధీగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. జియోను దేశంలో నంబర్ వన్ టెలీకాం కంపెనీ చేయాలన్నదే అంబానీ ధ్యేయంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.