యాప్నగరం

మార్చి తరవాత కూడా జియో ఫ్రీ ఆపర్!

ఉచిత 4జీ సర్వీసులతో దేశంలో సంచలనం రేపిన రిలయన్స్ జియో తన ఉచిత సర్వీసులను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచిన సంగతి తెలిసిందే.

TNN 10 Dec 2016, 2:42 pm
ఉచిత 4జీ సర్వీసులతో దేశంలో సంచలనం రేపిన రిలయన్స్ జియో తన ఉచిత సర్వీసులను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 2017 తరవాత కూడా జియో తన ఉచిత సర్వీసులను అందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో బడా వ్యాపారవేత్త అయిన ముఖేష్ అంబానీకి చెందిన జియో ఇన్ఫోకామ్‌ను దెబ్బతీసేందుకు దేశంలోని టాప్ 3 టెలీకాం సర్వీసులు ఇటీవల ఉచిత ఆఫర్లను ప్రవేశపెట్టాయి. జియోకు సమానంగా ఉచిత డాటా, కాల్స్ ఆఫర్లను ప్రకటించాయి. దీంతో ఈ పోటీని తట్టుకోడానికి జియో తన ఉచిత సర్వీసులను పొడిగించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల అంచనా వేస్తున్నాయి.
Samayam Telugu reliance jio may offer free calls beyond march 2017
మార్చి తరవాత కూడా జియో ఫ్రీ ఆపర్!


ఒకవేళ టెలీకాం కంపెనీలు 4జీ రేట్లను ఇదేవిధంగా తగ్గించుకుంటూ పోతే ప్రస్తుతం జియో అందిస్తోన్న ఉచిత సర్వీసులను మార్చి తరవాత కూడా కొన్ని నెలలపాటు పొడిగించే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీకి చెందిన టెలీకాం విశ్లేషకుడు రాజీవ్ శర్మ వెల్లడించారు. కాగా, దేశంలో టాప్ 3 టెలీకాం సంస్థలైన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ ఇప్పటికే ఉచిత ఆఫర్లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించాయి. మరోవైపు ప్రభుత్వ రంగ టెలీకాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ సైతం రూ.149 రీచార్జ్‌తో నెలంతా అపరమిత లోకల్, ఎస్టడీ కాల్స్ చేసుకునేలా ఆఫర్‌ను తీసుకొస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.