యాప్నగరం

'జియో' ఫీచ‌ర్ ఫోన్‌లో 'ఫేస్‌బుక్'...!

రిలయన్స్ జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ వినియోగిస్తున్న క‌స్ట‌మ‌ర్ల‌కు సంస్త శుభ‌వార్త‌ అందించింది. తన ఫీచర్ ఫోన్‌లో.. తాజాగా 'ఫేస్‌బుక్' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.

TNN 15 Feb 2018, 1:37 pm
రిలయన్స్ జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ వినియోగిస్తున్న క‌స్ట‌మ‌ర్ల‌కు సంస్థ శుభ‌వార్త‌ అందించింది. తన ఫీచర్ ఫోన్‌లో.. తాజాగా 'ఫేస్‌బుక్' యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు ఇక నుంచి జియో స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఫేస్‌బుక్ సేవ‌ల‌ను పొందవచ్చు. సాధార‌ణ ఫేస్‌బుక్ యాప్‌లో మాదిరిగానే యూజ‌ర్ల‌కు సేవ‌లు ల‌భిస్తాయి. ఇప్ప‌టికే జియో ఫోన్‌లో 'గూగుల్ అసిస్టెంట్' యాప్ అందుబాటులో ఉంది, ఇప్పుడు ఆ జాబితాలోకి 'ఫేస్‌బుక్' యాప్ కూడా వచ్చి చేరింది. జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా ఈ యాప్‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్లు ఫేస్‌బుక్ సంస్థ తెలిపింది.
Samayam Telugu reliance jio phone users to get facebook app
'జియో' ఫీచ‌ర్ ఫోన్‌లో 'ఫేస్‌బుక్'...!


ప్రసుత్తం జియో 4జీ ఫీచ‌ర్ ఫోన్‌ రూ.1500 ధరకు అన్ని రిలయెన్స్ డిజిటల్ స్టోర్లు, మొబైల్ షాప్‌లలోనూ లభిస్తున్నాయి. తన ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం రూ.49 ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. 28 రోజుల కాలపరిమితితో ఈ ప్లాన్ పనిచేయనుంది. ఈ ప్లాన్ కింద... అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అపరిమిత డేటా పొందవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.