యాప్నగరం

జియో వర్షాకాలం ఆఫర్: రూ.501కే జియోఫోన్!

సీజన్‌‌కు ఒక ఆఫర్‌ను తీసుకొచ్చే రిలయన్స్ జియో.. ఇప్పుడు వర్షాకాలం సందర్భంగా మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది.

Samayam Telugu 20 Jul 2018, 2:35 pm
సీజన్‌‌కు ఒక ఆఫర్‌ను తీసుకొచ్చే రిలయన్స్ జియో.. ఇప్పుడు వర్షాకాలం సందర్భంగా మరో కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ‘జియో మాన్‌సూన్ హంగామా ఆఫర్’ పేరిట తీసుకొచ్చిన ఈ కొత్త ఆఫర్‌ను శుక్రవారం నుంచే ప్రారంభించింది. ఆఫర్ కింద పాత ఫీచర్ ఫోన్ ఎక్స్‌ఛేంజ్‌పై కొత్త జియోఫోన్‌ను అందిస్తోంది. అది కూడా 501 రూపాయలకే. అయితే ఈ మొత్తం కూడా మళ్లీ మూడేళ్ల తరవాత వెనక్కి ఇచ్చేస్తారు. జియోఫోన్ కోసం మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసేటప్పుడు అది కచ్చితంగా పనిచేస్తూ ఉండాలి. అంతేకాకుండా ఛార్జర్ కూడా ఉండాలి.
Samayam Telugu JioPhone


స్పెషల్ రీఛార్జ్ ప్లాన్
మాన్‌సూన్ హంగామాలో భాగంగా ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌ను కూడా జియో తీసుకొచ్చింది. ఎక్స్‌ఛేంజ్ కింద జియోఫోన్‌ను కొనుగోలు చేసినవారు రూ.594తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్‌తో 6 నెలలపాటు అపరిమిత కాల్స్, డాటాను వినియోగదారులు పొందుతారు. ఆరు నెలలకు గాను 90జీబీ డాటా వస్తుంది. అంతేకాకుండా ప్రత్యేక ఎక్స్‌ఛేంజ్ బోనస్ కింద రూ.101 విలువచేసే 6జీబీ డాటా వోచర్‌ను కూడా ఇస్తున్నారు. అంటే ఎక్స్‌ఛేంజ్ కింద జియోఫోన్‌ను తీసుకునేవారు రూ.501 జియోఫోన్‌కు, రూ.594 రీఛార్జ్‌కు చెల్లించాల్సి ఉంటుంది.

ఎక్స్‌ఛేంజ్ నిబంధనలు
1. ఎక్స్‌ఛేంజ్ చేయాలనుకునే మొబైల్‌కు ఎలాంటి డేమేజ్ ఉండకూడదు. బాగా పనిచేస్తూ ఉండాలి.
2. గడిచిన 3.5 సంవత్సరాల లోపల (2015 జనవరి 1 తరవాత) కొనుగోలు చేసిన ఫోన్లు మాత్రమే ఎక్స్‌ఛేంజ్ చేయడానికి వీలవుతుంది.
3. 2జి, 3జి, 4జి (వీవోఎల్టీఈ కానివి) ఫోన్లు ఏవైనా ఎక్స్‌ఛేంజ్ చేసుకోవచ్చు.
4. జియోఫోన్, సీడీఎంఏ, ఆపరేటర్ లాక్ చేసిన ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేయడం కుదరదు.
5. ఎక్స్‌ఛేంజ్ చేసే ఫోన్‌కు బ్యాటరీ, ఛార్జర్ ఉంటే చాలు. హెడ్‌ఫోన్స్ లాంటి ఇతర యాక్ససరీస్ ఉండాల్సిన అవసరం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.