యాప్నగరం

4జీలో కింగ్ జియోనే..: ట్రాయ్

4జీ నెట్‌వర్క్ స్పీడులో రిలయన్స్ జియో మరోసారి సత్తా చాటింది. ఏప్రిల్ నెలకు గాను 19.12 ఎంబీపీఎస్ 4జీ డౌన్‌లోడ్ స్పీడుతో అగ్రస్థానంలో నిలిచింది.

TNN 5 Jun 2017, 5:22 pm
4జీ నెట్‌వర్క్ స్పీడులో రిలయన్స్ జియో మరోసారి సత్తా చాటింది. ఏప్రిల్ నెలకు గాను 19.12 ఎంబీపీఎస్ 4జీ డౌన్‌లోడ్ స్పీడుతో అగ్రస్థానంలో నిలిచింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధిక 4జీ డౌన్‌లోడ్ స్పీడు కావడం విశేషం. ఈ మేరకు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ నివేదికను విడుదల చేసింది.
Samayam Telugu reliance jio tops chart in 4g download speed in april trai
4జీలో కింగ్ జియోనే..: ట్రాయ్


తన ‘మైస్పీడ్’ అప్లికేషన్ ఆధారంగా టెలీకాం కంపెనీల 4జీ నెట్‌వర్క్ స్పీడును ట్రాయ్ లెక్కగట్టింది. ఓ యూజర్ ఒక బాలీవుడ్ సినిమాను 16ఎంబీపీఎస్ స్పీడుతో 5 నిమిషాల్లో డౌన్‌లోడు చేసుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఏప్రిల్‌లో రిలయన్స్ జియో అత్యధికంగా 19.12 ఎంబీపీఎస్ స్పీడు నమోదు చేసిందని చెప్పింది. గత నెలతో పోలిస్తే (18.48 ఎంబీపీఎస్) జియో పనితీరు ఏప్రిల్‌లో మెరుగ్గా ఉందని ట్రాయ్ పేర్కొంది.

ఏప్రిల్‌తో కలసి వరసగా నాలుగు నెలల పాటు 4జీ స్పీడ్ చార్ట్‌లో రిలయన్స్ జియోనే రారాజుగా కొనసాగడం గమనార్హం. ఇక ఏప్రిల్‌లో మిగిలిన టెలీకాం ఆపరేటర్ల 4జీ స్పీడు విషయానికి వస్తే.. 13.70 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడుతో ఐడియా సెల్యులర్ రెండో స్థానంలో ఉంది. ఇక 13.38 ఎంబీపీఎస్ స్పీడుతో వొడాఫోన్ మూడో స్థానానికి చేరింది. దేశంలో అతిపెద్ద టెలీకాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ మాత్రం 10.15 ఎంబీపీఎస్ స్పీడుతో నాలుగో స్థానానికి పడిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.