యాప్నగరం

Bank Notes: కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ కీలక ఆదేశాలు..

Currency Note Sorting Machines : బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి నోట్ సార్టింగ్ మెషీన్లను పరీక్షించాల్సి ఉంటుందని తెలిపింది. కరెన్సీ నోట్లను ఫిట్ నోట, అన్‌ఫిట్ కేటగిరి కింద పేర్కొన్నాలని పేర్కొంది. దీనికి కొన్ని పారామీటర్లను నిర్దేశించింది. వీటి ఆధారంగా బ్యాంకులు నోట్లను వర్గీకరించాల్సి ఉంటుంది. రీసైక్లింగ్ లేదంటే రీఇష్యూకు అనుగుణంగా లేని నోట్లను అన్‌ఫిట్ నోట్ల కింద పేర్కొనాలి.

Authored byKhalimastan | Samayam Telugu 2 Jul 2022, 12:05 pm

ప్రధానాంశాలు:

  • బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు
  • నోట్ సార్టింగ్ మెషీన్లను ప్రతి క్వార్టర్‌లోనూ పరీక్షించాలి
  • కరెన్సీ నోట్ల ఫిట్‌నెస్, అథంటిసిటీ పారామీటర్లు
  • వీటికి అనుగుణంగా ఉంటేనే ఫిట్ నోట్‌గా పరిగణించాలి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu rbi news
ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
RBI News: దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్లకు సంబంధించి బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కరెన్సీ నోట్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోవడానికి బ్యాంకులు ప్రతి 3 నెలలకు ఒకసారి వాటి సార్టింగ్ మెషీన్లను కచ్చితత్వం, స్థిరత్వం కోసం పరీక్షించాలని ఆర్‌బీఐ వివరించింది.
భారత ప్రభుత్వం 2016 నవంబర్ నెలలో డీమోనిటైజేషన్ ప్రకటించింది. దీంతో పాత రూ. 500, రూ. 1000 కరెన్సీలు నోట్లు రద్దు అయ్యాయి. కేంద్రం కొత్త కరెన్సీ నోట్లను తీసుకువచ్చింది. రూ. 200, రూ. 500, రూ. 2000 నోట్లును తెచ్చింది. తర్వాత ఇంకా ఇతర విలువల్లోనూ కొత్త నోట్లను ఆవిష్కరించింది. రూ. 20 నోట్లు, రూ. 50 నోట్లలో కూడా కొత్తవి మార్కెట్‌లోకి వచ్చాయి.

Also Read: undefined

ఇలా కొత్త నోట్లను కొత్త సిరీస్‌లో తీసుకువచ్చిన నేపథ్యంలో ఆర్‌బీఐ తాజాగా నోట్ అథంటికేషన్ అండ్ ఫిట్‌నెస్ సార్టింగ్ పారామీటర్లను సమీక్షించింది. కొత్త రూల్స్‌ను తీసుకువచ్చింది. వీటిని బ్యాంకులు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘నోట్ సార్టింగ్ మెషీన్స్ అథంటికేషన్ అండ్ ఫిట్‌నెస్ సార్టింగ్ పారమీటర్స్’ అనే సర్క్యూలర్‌లో వాస్తవమైన, తగినంత శుభ్రంగా ఉండే, విలువను సులభంగా నిర్ధారించడానికి, రీసైక్లింగ్‌కు అనుకూలంగా ఉంటే కరెన్సీ నోటును ఫిట్ నోట్‌గా (మంచి నోటు/ చెలామణికి అనువైన నోటు) పరిగణించాలని ఆర్‌బిఐ పేర్కొంది.

అలాగే అన్‌ఫిట్ నోటు (పనికిరాని నోటు) అంశానికి కూడా ఆర్‌బీఐ ఒక నిర్వచనం ఇచ్చింది. రీసైక్లింగ్‌కు అనుగుణంగా లేనటువంటి, లేదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా దశల వారీగా తొలగించిన సిరీస్‌కు చెందిన నోట్లను అన్‌ఫిట్ నోట్లుగా పరిగణించాలి. ఫిట్‌నెట్ పారామీటర్స్‌ అన్నింటికీ అనుగుణంగా ఉన్న నోట్లను రీసైక్లింగ్‌/రీఇష్యూ‌కు అనువైన నోటుగా పరిగణించాలని తెలిపింది. నోట్ సార్టింగ్ మెషీన్స్ ద్వారా కరెన్సీ నోట్ల ఫిట్‌నెస్‌, అథంటిసిటీ గుర్తించాలని పేర్కొంది. ప్రతి మూడు నెలలకు ఈ ప్రక్రియ జరగాలని సూచించింది. అలాగే ఈ వివరాలను ఆర్‌బీఐకి పంపాలని తెలిపింది. అలాగే చినిగిపోయిన నోట్లు, నకిలీ నోట్లను అన్‌ఫిట్ నోటు కేటగిరి కింద ఉంచాలని పేర్కొంది. వీటిని బ్యాంకులు కచ్చితంగా అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.