యాప్నగరం

కొత్త రూ.10 నోట్లు త్వరలో చెలామణిలోకి...!

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలో కొత్త పదిరూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది.

TNN 10 Mar 2017, 7:42 am
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా త్వరలో కొత్త పదిరూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకురానుంది. భద్రతా ప్రమాణాలతో కొత్త నోటును తీసుకువస్తామని ఆర్బీఐ ప్రకటించింది. కొత్త నోట్లు వచ్చిన కూడా పాత నోట్లకు ఏ ఢోకా లేదని వాటిని ఎంచక్కా వాడుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం చలామణిలో 2005 సిరీస్ నోట్లు ఉన్నాయి. వాటిపై ఉన్న నెంబర్ ప్యానెల్ లో ఆంగ్ల అక్షరం ఎల్ ను చేర్చి... కొత్త నోట్లను ముద్రించనున్నట్టు ఆర్బీఐ చెప్పింది. అలాగే ప్రస్తుతం గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో పాటే... 2017 ఏడాదిగా నోట్లపై అచ్చువేయించనున్నట్టు తెలిపింది. నెంబర్ ప్యానెల్ లోని మొదటి మూడు అక్షరాలు మినహాయించి... మిగతా అక్షరాలు పరిమాణం ఎడమనుంచి కుడికి ఆరోహణ క్రమంలో ఉంటుందని చెప్పింది.
Samayam Telugu reserve bank of india to issue new rs 10 notes
కొత్త రూ.10 నోట్లు త్వరలో చెలామణిలోకి...!


ఆర్బీఐ గతేడాది జరిగిన నోట్ల రద్దు తరువాత... కొత్త నోట్ల ముద్రణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. నవంబర్ 8, 2016న రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తరువాత కొత్త రూ.500 నోటును, రూ.2000 నోటును చెలామణిలోకి తెచ్చారు. ఇప్పుడు రూ.10 నోటును తే బోతున్నారు. గతంతో పోలిస్తే నోటు పొడవు వెడల్పులు కూడా తగ్గాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.