యాప్నగరం

త్వరలో కొత్త వంద నోట్లు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త రూ.100 నోట్లను చలామణీలోకి తీసుకురానుంది.

TNN 3 Feb 2017, 10:21 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్త రూ.100 నోట్లను చలామణీలోకి తీసుకురానుంది. 2005లో వచ్చిన మహాత్మ గాంధీ సిరీస్‌ను ఈ కొత్త వంద నోట్లు పోలి ఉండనున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసారు. ఈ నోట్లపై ఉండే నంబర్ ప్యానల్ మధ్యలో R అనే అక్షరం ఉంటుందని, అలాగే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం కూడా ఉంటుందని పేర్కొంది.
Samayam Telugu reserve bank of india to soon put new rs 100 banknotes in circulation
త్వరలో కొత్త వంద నోట్లు


నోటు వెనుకవైపు ప్రింటింగ్ చేసిన సంవత్సరం ‘2017’ ఉంటుందట. కొత్త నోట్లలో పెద్దగా మార్పులు ఏమీ చేయలేదని. 2005 నుంచి వస్తున్న మహాత్మ గాంధీ సిరీస్‌లోనే ఈ కొత్త బ్యాంక్ నోట్లను కూడా తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ వివరించింది. అలాగే నోటు ఫీచర్లను ఆర్బీఐ వెల్లడించింది. కొత్త నోటుపై సీరియల్ నంబర్‌లో ఉన్న అంకెలు చిన్న నుంచి పెద్దగా ఉంటాయని, సులభంగా గుర్తించడానికి బ్లీడ్ లైన్స్, పెద్ద ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.