యాప్నగరం

SBI Alert: రోజుకు రూ.20 వేలే డ్రా.. ఎప్పటి నుంచో తెలుసా?

ఈ నిర్ణయం కారణంగా మోసాల మీద నిఘా ఉంచడానికి అవకాశం ఏర్పడంతో పాటు, డిజిటల్ లావాదేవీలు పెరగడానికి అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

Samayam Telugu 30 Oct 2018, 9:09 pm
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) గతంలో ప్రకటించినట్లుగానే రోజువారీ విత్‌డ్రా పరిమితి రూ.20 వేలను బుధవారం (అక్టోబర్‌ 31) అర్థరాత్రి నుంచి అమల్లోకి తేనుంది. ఈ మేరకు ఎస్‌బీఐ క్లాసిక్‌, మ్యాస్ట్రో డెబిట్‌ కార్డులు వినియోగిస్తున్నవారు రూ.20వేలు మాత్రమే ఏటీఎంల నుంచి డ్రా చేసుకోగలరని బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీని ప్రభావం 1.42 కోట్ల ఎస్‌బీఐ కస్టమర్ల మీద పడనుంది. ఇంతకాలం రూ.40 వేలు డ్రా చేసుకోవడానికి వెసులుబాటు ఉండేది. అయితే ఈ రెండు డెబిట్ కార్డులు మినహా మిగతా వేరియంట్ ఎస్బీఐ డెబిట్ కార్డులు వినియోగిస్తున్నవారికి మాత్రం ఈ పరిమితి వర్తించదని వారు తెలిపారు.
Samayam Telugu SBI


అయితే.. రూ.20 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాలనుకునేవారు 'హై వేరియంట్‌ డెబిట్‌ కార్డ్‌'కు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంపై బ్యాంక్‌ ఉన్నతాధికారులు స్పందిస్తూ.. 'ఎక్కువ మంది కస్టమర్లు రోజుకు రూ.20 వేలకు మించి ఏటీఎంల నుంచి డ్రా చేయడం లేదని తమ పరిశీలనలో తేలినట్లు స్పష్టం చేశారు.

అయితే వ్యాపార లావాదేవీల నిమిత్తం కొందరు వ్యాపారులు మాత్రమే రోజుకు రూ.40,000 వరకు నగదును ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఏటీఎంల వద్ద నగదు ఉపసంహరణలో మోసాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడానికి కూడా ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అధికారులు అంటున్నారు. అక్టోబరు 31 నుంచి ఈ పరిమితి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ నెలరోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.