యాప్నగరం

Andhra Bank కొత్త క్రెడిట్ కార్డు అదిరింది.. ఉచితంగానే..

మీరు కొత్త క్రెడిట్ కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషల్ క్రెడిట్ కార్డును ఆవిష్కరించింది. దీని వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

Samayam Telugu 20 Sep 2021, 7:37 am

ప్రధానాంశాలు:

  • అదిరిపోయే క్రెడిట్ కార్డు
  • లాంచ్ చేసిన యూనియన్ బ్యాంక్
  • బెనిఫిట్స్ ఇవే

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu credit card
ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. కొత్త క్రెడిట్ కార్డును మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో NPCI భాగస్వామ్యం కుదుర్చుకుంది.
యూనియన్ బ్యాంక్ తాజాగా తీసుకువచ్చిన క్రెడిట్ కార్డు పేరు రూపే జేసీబీ వెల్‌నెస్ క్రెడిట్ కార్డు. బ్యాంక్ జేసీబీ నెట్‌వర్క్ ద్వారా ఈ కార్డును తీసుకువచ్చింది. ఈ కార్డు తీసుకోవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. లైఫ్‌స్టైల్, ఫిట్‌నెస్, హెల్త్, పర్సనల్ కేర్ విభాగాలు లక్ష్యంగా బ్యాంక్ ఈ కార్డును ఆవిష్కరించింది.

Also Read: undefined


Also Read: undefined

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపే జేసీబీ వెల్‌నెస్ క్రెడిట్ కార్డు తీసుకోవడం వల్ల.. ఏడాదిలో ఒకసారి ప్రీమియం హెల్త్ చెకప్‌ ఉచితంగా పొందొచ్చు. తర్వాత హెల్త్ చెకప్స్‌పై డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఏడాదిలో ఒకసారి స్పా ఉచితంగా పొందొచ్చు. తర్వాత డిస్కౌంట్ లభిస్తుంది.

డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ ఉచితం. 15 రోజులు లేదా నెల వరకు ఉచితంగా జిమ్ మెంబర్‌షిప్ పొందొచ్చు. తర్వాత 40- 50 శాతం తగ్గింపు పొందొచ్చు. అలాగే ఎంపిక చేసిన వ్యాపార భాగస్వాముల ద్వారా ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు లభిస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.