యాప్నగరం

19 నెల‌ల క‌నిష్టానికి రూపాయి

డాలర్‌తో రూపాయి విలువ బుధవారం ఉదయం 19 నెలల కనిష్టానికి పడిపోయింది.

Samayam Telugu 27 Jun 2018, 1:27 pm
డాలర్‌తో రూపాయి విలువ బుధవారం ఉదయం 19 నెలల కనిష్టానికి పడిపోయింది. మంగ‌ళ‌వార‌మే డాల‌రుతో రూపాయి మార‌కం వారం క‌నిష్ట స్థాయిని న‌మోదు చేసింది.పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావం కారణంగా ద్రవ్యోల్భణం, ఆర్థిక లోటు పెరుగుతుందని ట్రేడర్స్ ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు.
Samayam Telugu rupee vs dollar.
డాలర్‌తో రూపాయి విలువ


డాలర్‌తో పోల్చుకుంటే రూ.68.42 పైసలతో ప్రారంభమైంది. ఆ తర్వాత 68.50కి పడిపోయింది. ఇది దాదాపు రెండేళ్ల క్రితం అంటే 1 డిసెంబర్ 2016కు పడిపోయింది. అంతకుముందు రోజు కంటే 30 పైస‌లు పడిపోయింది. అంతకుముందు 67.99గా ఉంది. ఏడాది డేటా చూసుకుంటే 7 శాతం పడిపోయింది. మంగళవారం ఇంధన ధరలు పెరిగాయి.
కాగా, రెండు రోజుల క్రితం ఆర్బీఐ.. డాలర్‌తో రూపాయి మారకం విలువను 68.1466గాను, యూరోతో 79.3499 గాను నిర్ణయించింది. 2018, జూన్ 22న ఈ మారకం రేట్లు 67.7695, 78.8566గా ఉండేవి. ఈ మేరకు ఆర్బీఐ ఒక ప్రకటన విడుదల చేసింది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.