యాప్నగరం

2017 స్విఫ్ట్ లుక్ అదిరిపోయింది!

మారుతీ సుజుకి స్విఫ్ట్.. చిన్న కార్ల మార్కెట్‌లో ఎలాంటి విప్లవం లేవనెత్తిందో అందరికీ తెలిసిందే.

TNN 3 Jan 2017, 5:23 pm
మారుతీ సుజుకి స్విఫ్ట్.. చిన్న కార్ల మార్కెట్‌లో ఎలాంటి విప్లవం లేవనెత్తిందో అందరికీ తెలిసిందే. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో స్విఫ్ట్ చేసిన బిజినెస్ ఇతర ఏ బ్రాండ్ కార్ చేయలేదనడం అతిశయోక్తి కాదు. 2004లో విడుదలైన ఫస్ట్ జనరేషన్ స్విఫ్ట్‌ 5.3 మిలియన్లకు పైగా అమ్ముడుపోయింది. తన క్యూట్ స్టైలింగ్, షార్ప్ హ్యాండ్లింగ్‌తో ఎంతో మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది ఈ బుల్లి కారు. ఆ తరవాత సంవత్సరానికో మోడల్ వచ్చినా పెద్దగా మార్పులేమీ చోటుచేసుకోలేదు.
Samayam Telugu safer smarter suzuki swift to make global debut in geneva
2017 స్విఫ్ట్ లుక్ అదిరిపోయింది!


అయితే 2017 స్విఫ్ట్ మాత్రం కొత్త లుక్‌తో, మరింత ఎక్కువ టెక్నాలజీతో దూసుకొస్తోంది. ఈ కొత్త కారు మొత్తం మూడు వేరియంట్లలో లభించనుంది. హైబ్రిడ్, టర్బో, నాచ్యురల్-ఆస్పిరేటెడ్ వర్షన్లలో వస్తున్న ఈ కొత్త స్విఫ్ట్ ఆర్‌ఎస్‌ను మార్చిలో జరగనున్న జెనీవా మోటార్ షోలో ప్రదర్శించనున్నారు. ఈ షో ద్వారా స్విఫ్ట్ ఆర్ఎస్‌‌కి సంబంధించి మరిన్ని విశేషాలు తెలుస్తాయి. ప్రస్తుతానికి ధర విషయంలో ఎలాంటి సమాచారం లేనప్పటికీ జనవరి 4 నుంచి ఈ కారు జపాన్‌లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.