యాప్నగరం

స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లోకి సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు.

TNN 9 Mar 2017, 3:33 pm
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాడు. దీనికోసం ‘బీయింగ్‌స్మార్ట్’ (BeingSmart) బ్రాండ్‌ను రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. అయితే సల్లూ భాయ్ స్వయంగానే స్మార్ట్‌ఫోన్ కంపెనీ స్థాపిస్తు్న్నారా లేదా తన కుటుంబ సభ్యుల ద్వారా నెలకొల్పనున్నారా అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి అయితే గతంలో సామ్సంగ్, మైక్రోమాక్స్‌లో పనిచేసిన ఓ ప్రొఫెషనల్ సారథ్యంలో కార్యాచరణ నిర్వహణ బృందాన్ని సల్మాన్ నియమించినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Samayam Telugu salman khan ventures into smartphones business with beingsmart
స్మార్ట్‌ఫోన్ బిజినెస్‌లోకి సల్మాన్ ఖాన్!


ఈ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఇప్పటికే ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో రెడీమేడ్ వస్త్రాల బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు. తన చెల్లెలు అల్విరా ఖాన్‌తో కలసి ఈ బిజినెస్‌ను నడుపుతున్నాడు సల్మాన్. ఇప్పుడు ‘బీయింగ్‌స్మార్ట్’తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పిటకే ఒక చైనీస్ ప్లాంట్‌ను కూడా సల్మాన్ పరిశీలించాడట. రూ. 20వేల కంటే తక్కువ ధరతో ఆండ్రాయిడ్ ఫోన్లను ‘బీయింగ్‌స్మార్ట్’ బ్రాండ్ ద్వారా తయారుచేయనున్నట్లు సమాచారం. సల్లూ భాయి స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్‌లోకి వస్తే ఒప్పో, వివో, షియోమి వంటి చైనా కంపెనీలతో పాటు లావా, మైక్రోమాక్స్ వంటి దేశీ కంపెనీలకు గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.