యాప్నగరం

కుంభకోణంలో ఇరుక్కున్న సామ్‌సంగ్ వారసుడు

సామ్‌సంగ్ వారసుడు, వైస్ చైర్మన్ లీ జే యాంగ్ దక్షిణ కొరియాలో జరిగిన ఒక కుంభకోణం కేసులో ఇరుక్కున్నారు.

TNN 12 Jan 2017, 7:49 am
సామ్‌సంగ్ వారసుడు, వైస్ చైర్మన్ లీ జే యాంగ్ దక్షిణ కొరియాలో జరిగిన ఒక కుంభకోణం కేసులో ఇరుక్కున్నారు. సామ్‌సంగ్ గ్రూప్ చైర్మన్ లీ కున్ హీ కుమారుడైన యాంగ్‌ని ఓ లంచం కేసులో అనుమానితుడిగా పరిగణించి ప్రశ్నించినట్లు ఆ దేశ దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు గురువారం అతనిపై విచార జరపనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ వ్యాపారంలో రారాజులా కొనసాగుతున్న సామ్‌సంగ్ చీఫ్‌పై కుంభకోణ ఆరోపణలు రావడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
Samayam Telugu samsung vice chairman linked to growing south korea bribery scandal
కుంభకోణంలో ఇరుక్కున్న సామ్‌సంగ్ వారసుడు


దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ జీన్ హేకు ఆప్తురాలైన చోయ్ సూన్ సిల్‌పై ఆరోపణలతో ఈ కేసు మొదలైంది. అధ్యక్షురాలుతో ఉన్న సంబంధాలను అడ్డుపెట్టుకుని చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడినట్టు దర్యాప్తు అధికారులు తేల్చారు. లాభాపేక్ష లేని సంస్థలకు భారీగా విరాళాలు ఇవ్వాల్సిందిగా దిగ్గజ కంపెనీలపై చోయ్ ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లాభాపేక్ష లేని సంస్థలను తన వ్యక్తిగత ఖజానాలుగా చోయ్ వాడుకున్నారు. అయితే ఈ లాభాపేక్ష లేని సంస్థలకు అత్యధికంగా విరాళాలిచ్చింది సామ్‌సంగేనని ఆరోపణలు గట్టిగా ఉన్నాయి.

కొన్ని నెలలుగా లీ జే యాంగ్‌తో పాటు సామ్‌సంగ్ సీనియర్ అధికారులు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు రెండు వాదనలు వినిపిస్తున్నారు. చోయ్ పుట్టించిన సంస్థలకు సామ్‌సంగ్ విరాళాలు భారీగా ఇచ్చినప్పటికీ అందుకు ప్రతిఫలం ఏమీ కోరలేదని, కాబట్టి దానిని లంచంగా పరిగణించలేమని కొంతమంది అధికారులు వాదిస్తున్నారట. కాగా, చోయ్ వ్యవహారం కాస్త అధ్యక్షురాలు పార్క్ జీన్ మెడకు చుట్టుకుంది. చోయ్‌తో పార్క్ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలతో పార్లమెంట్ ఆమెని అభిసంసశనకు గురిచేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.