యాప్నగరం

ఐఫోన్‌ దండగ.. సామ్సంగ్ వెక్కిరింత!

యాపిల్ ఐఫోన్ అంటే యువతలో ఒక క్రేజ్. ఐఫోన్ కొత్త మోడల్ వస్తుందంటే చాలు స్టోర్ల ముందు క్యూలు కడతారు.

TNN 6 Nov 2017, 3:33 pm
యాపిల్ ఐఫోన్ అంటే యువతలో ఒక క్రేజ్. ఐఫోన్ కొత్త మోడల్ వస్తుందంటే చాలు స్టోర్ల ముందు క్యూలు కడతారు. మార్కెట్‌లో దొరికే ఫోన్ల ధరలతో పోలిస్తే ఐఫోన్ ధర చాలా ఎక్కువే అయినప్పటికీ దాన్ని చేజిక్కుంచుకోవడానికి వెనకాడరు. అంతటి క్రేజ్, గుర్తింపు ఉన్న ఐఫోన్‌ను ఇప్పుడు సామ్సంగ్ వెక్కిరిస్తోంది. ఐఫోన్ చరిత్రను వెక్కిరిస్తూ.. తన గెలాక్సీ సిరీస్‌ గొప్పతనాన్ని చెబుతూ సామ్సంగ్ తాజాగా ఒక వీడియో ప్రకటనను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ప్రకటన వైరల్‌గా మారింది.
Samayam Telugu samsungs new ad makes fun of apples last ten years
ఐఫోన్‌ దండగ.. సామ్సంగ్ వెక్కిరింత!


సాధారణంగా ఏ కంపెనీ అయినా తమ ఉత్పత్తులు గొప్పవని ప్రచారం చేసుకుంటుంది కానీ, ఫలానా కంపెనీ ఉత్పత్తుల కన్నా గొప్పవని పేరు ప్రస్తావించి ప్రకటనలు వేసే సాహసం చేయవు. గతంలో అలాచేసిన కంపెనీలు వివాదాల్లో చిక్కుకున్నాయి. కానీ ఇప్పుడు యాపిల్ ఐఫోన్ల కన్నా తమ గెలాక్సీ ఫోన్లే గొప్పవని, గెలాక్సీకి అప్‌గ్రేడ్ అవ్వండంటూ సామ్సంగ్ రూపొందించిన ప్రకటన ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి. యాపిల్ పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఐఫోన్ టెన్ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు నవంబర్ 3 నుంచే భారత్‌లో ప్రారంభమయ్యాయి. యాపిల్ లవర్స్ నుంచి వీటికి మంచి స్పందన కూడా వస్తోంది.

అయితే సామ్సంగ్ తాజాగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్ 8ని ప్రచారం చేసుకోవడం కోసం ఐఫోన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. 2007 నుంచి అప్పటి ఐఫోన్ మోడల్‌ను, గెలాక్సీ ఫోన్‌ను పోల్చుతూ ఆ ప్రకటన ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి తమ గెలాక్సీ ఫోన్‌లో ఎప్పుడో ప్రవేశపెట్టిన సరికొత్త ఫీచర్లను యాపిల్ ఇప్పుడు తమ ఐఫోన్లలో తీసుకొస్తుందన్నట్లు ఆ ప్రకటన ఉంది. ఐఫోన్‌ను పక్కన పెట్టి గెలాక్సీకి మారండంటూ యాడ్ ముగుస్తుంది. ఆ యాడ్‌ను మీరూ చూసేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.