యాప్నగరం

41 లక్ష‌ల అకౌంట్ల‌ను క్లోజ్ చేసిన ఎస్బీఐ

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం క‌స్ట‌మ‌ర్ల ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదివ‌ర‌కూ ఖాతాల్లో నిల్వ ఎంత ఉన్నా ప‌ట్టించుకోని ఎస్బీఐ ఇప్పుడు కొత్త నిబంధ‌న‌ల విష‌యంలో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కేవ‌లం క‌నీస నిల్వ లేని కార‌ణంగా ల‌క్ష‌ల ఖాతాల‌ను మూసివేస్తోంది

TNN & Agencies 15 Mar 2018, 12:29 pm
ప్ర‌భుత్వ బ్యాంకింగ్ దిగ్గ‌జం ఎస్‌బీఐ కనీస నిల్వలేమి కారణంగా గతేడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా 41.2 లక్షల సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలను మూసేసింది. కనీస స‌గ‌టు నిల్వ‌ నిర్వహణలో విఫలమైతే చార్జీల విధింపును గతేడాది ఏప్రిల్‌ నుంచి బ్యాంకు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
Samayam Telugu sbi closes 41 2 lakh savings accounts for not keeping minimum balance
41 లక్ష‌ల అకౌంట్ల‌ను క్లోజ్ చేసిన ఎస్బీఐ



అలాగే, ఏప్రిల్‌ నుంచి ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకుల విలీనం జరిగిన విషయం గమనార్హం. కనీస నిల్వ లేని కారణంగా వాటికి నిధులు కేటాయింపులు చేయాల్సి ఉండటంతో 41.16 లక్షల ఖాతాలను మూసేసినట్టు సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తుకు ఎస్‌బీఐ సమాధానం ఇచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.