యాప్నగరం

SBI: అదే జరిగింది.. ఛార్జీలు పెంచేసిన ఎస్‌బీఐ.. కస్టమర్లకు పెద్ద దెబ్బ.. కొత్త రేట్లు ఇవే..

SBI Credit Card Charges: ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు మరో ఝలక్ ఇచ్చింది. ముందుగా చెప్పినట్లుగానే SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్.. క్రెడిట్ కార్డులపై ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచేసింది. మార్చి 17 నుంచే పెంచిన రేట్లు అమల్లోకి రాగా.. కొత్త ఛార్జీల గురించి తెలుసుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 23 Mar 2023, 10:31 am
SBI: ఎస్‌బీఐ Cards and Payment Services మరో కీలక ప్రకటన చేసింది. SBI క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ ఛార్జీలను పెంచేసింది. మార్చి 17 నుంచి పెంచిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎస్‌బీఐ కార్డ్స్.. తన కస్టమర్లకు మెయిల్‌లో తెలిపింది. మీరు ఎస్‌బీఐ కార్డ్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ అయితే.. మీపై ఛార్జీల మోత మోగిపోతుంది. గతంలో చెప్పినట్లుగానే ఎస్‌బీఐ రెంట్ పేమెంట్స్‌పై ప్రాసెసింగ్ ఛార్జీలను భారీగా పెంచేసింది. గతంలో ఈ రెంట్ పేమెంట్స్ ప్రాసెసింగ్ ఫీజు ట్యాక్స్‌కు అదనంగా రూ.99గా ఉంటే.. ఇప్పుడు అది ఏకంగా రూ.199కి ఎగబాకింది. అంటే రెట్టింపు అయిందన్నమాట. ఇంకా ట్యాక్స్ అదనంగా ఉంది. 100 శాతం కంటే ఎక్కువ పెరిగింది. 2023, మార్చి 17 నుంచి.. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో చేసే రెంట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు (SBI Processing Charges) మారుతాయని ఫిబ్రవరిలోనే ప్రకటించింది. 2022 నవంబర్‌లోనూ ఈ క్రెడిట్ కార్డు ప్రాసెసింగ్ ఛార్జీల్ని SBI Cards పెంచింది.
Samayam Telugu sbi card charges


అంటే ఇకపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడేవారు.. దీనితో చేసే రెంట్ పేమెంట్లపై ప్రాసెసింగ్ ఛార్జీలు ఎక్కువ కట్టాల్సిందే అన్నమాట. గతంలో చెల్లించిన దాని కంటే డబుల్ కట్టాల్సి వస్తుంది. ఇక ఈ రెంట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఛార్జీలు బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌లో రెంట్ పేమెంట్స్‌లో ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తోంది. హెచ్‌డీఎఫ్‍‌సీ కూడా ఇంతే మొత్తంలో వసూలు చేయనున్నట్లు గతంలో వివరించింది. ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్.. రెంట్ పేమెంట్స్‌కు సంబంధించి ఇందులో ఒక శాతం ఛార్జీ సహా జీఎస్‌టీ అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలిపింది. ఇదే తీరున బ్యాంక్ ఆఫ్ బరోడాలో కూడా ఉంది.

ప్రస్తుతానికి SBI Cards మాత్రమే.. రెంట్ పేమెంట్స్ ప్రాసెసింగ్ ఛార్జీల్ని నగదు రూపంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా వన్నీ పర్సంటేజీల రూపంలో తీసుకుంటున్నాయి. ఇక మిగతావాటీతో పోలిస్తే SBI కాస్త ఎక్కువే వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీటికి అదనంగా.. డెబిట్ కార్డు ఛార్జీలు, SMS ఛార్జీలు, పాస్‌బుక్ ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు ఇలా చాలానే ఉంటాయి.

Bonus: ఉద్యోగులకు మొన్న 50 నెలల జీతం బోనస్.. ఇప్పుడు మరో బంపర్ ఆఫర్.. కలలో ఊహించని రీతిలో ప్రకటనలు! Google Layoffs: తొలగించిన గూగుల్ ఉద్యోగులకు అత్యంత చేదు అనుభవం.. ఆ డబ్బులేం రావట! Rajalakshmi Vijay: జాగింగ్ చేస్తుండగా ఢీకొట్టిన కారు.. టెక్ కంపెనీ సీఈఓ దుర్మరణం.. ఎంత పనైంది!


రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.