యాప్నగరం

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. రూ.10 వేల డిస్కౌంట్!

మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకోసం ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. అదే రూ.10000 క్యాష్‌బ్యాక్. యాపిల్ ఉత్పత్తులపై ఈ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఆఫర్ మార్చి చివరి వరకు ఉంటుంది.

Samayam Telugu 28 Jan 2022, 12:13 pm

ప్రధానాంశాలు:

  • ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే వారికి తీపికబురు
  • యాపిల్ ఉత్పత్తులపై రూ.10 వేల వరకు తగ్గింపు
  • ఈ ఆఫర్ మార్చి నెల చివరి వరకు అందుబాటులో ఉంటుంది
  • అయితే ఎంపిక చేసిన ప్రొడక్టులకే ఆఫర్ వర్తిస్తుంది.

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi
మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీరు కొత్తగా మొబైల్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అది కూడా యాపిల్ ఐఫోన్ కొనాలని యోచిస్తున్నారా? లేదంటే యాపిల్ మ్యాక్‌బుక్ కొనాలి చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం ఒక ఆఫర్ అందుబాటులో ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ కొనుగోలు చేస్తే రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ అందిస్తున్న ఈ ఆఫర్ మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన యాపిల్ ప్రొడక్టులపై రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఎస్‌బీఐ టాటా కార్పొరేట్ క్రెడిట్ కార్డ్, పేటీఎం ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు మినహా మిగతా క్రెడిట్ కార్డులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎస్‌బీఐ కార్డ్ తెలిపింది.

Also Read: undefined

పైన్ ల్యాబ్స్ ఈడీసీ మెషీన్స్ ద్వారా జరిపే ట్రాన్సాక్షన్లకు ఆఫర్ వర్తిస్తుంది. అదే ఇతర పీఓఎస్ స్టోర్లలో అయితే చార్జ్ స్లిప్‌పై క్యాష్‌బ్యాక్ మెసేజ్ ఉంటేనే ఆఫర్ వర్తించినట్లు అవుతుంది. అదే పీఓఎస్ ఔట్‌లెట్స్‌లో అయితే కార్డుపై రెండు సార్లు ఆఫర్ పొందొచ్చు. టాటా క్లిక్‌లో ఒక్కసారి మాత్రమే కార్డు ద్వారా ఈ ఆఫర్ పొందొచ్చు.

Also Read: undefined

2022 జూలై 4న క్యాష్‌బ్యాక్ డబ్బులు పొందొచ్చు. ఏ ఏ స్టోర్లలో ఆఫర్ అందుబాటులో ఉందో ఎస్‌బీఐ కార్డు వివరాలు కూడా అందుబాటులో ఉంచింది. మీరు ఎస్‌బీఐ కార్డు వెబ్‌సైట్‌కు వెళ్లి ఆఫర్ ఏ ఏ స్టోర్లలో అందుబాటులో ఉందో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆఫర్ ఎంపిక చేసిన ప్రొడక్టులకే వర్తిస్తుందని గమనించాలి. వీటి వివరాలు కూడా ఎస్‌బీఐ కార్డు వెబ్‌సైట్‌లో పొందొచ్చు.

ఇకపోతే క్రెడిట్ కార్డు లేని వారు కార్డు కోసం అప్లై చేసుకోవాలని భావిస్తే.. ఎస్‌బీఐ కార్డు వెబ్‌సైట్‌కు వెళ్లి నేరుగా కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. తొలిసారి కార్డు పొందాలని భావించే వారు సింప్లీ క్లిక్ కార్డు ఎంచుకోవడం ఉత్తమం. ఈ కార్డు ద్వారా పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. వెల్‌కమ్ గిఫ్ట్ కింద రూ.500 అమెజాన్ వోచర్ వస్తుంది. కార్డు ఫీజు రూ.499. వార్షిక యాన్యల్ చార్జీ రూ.499.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.