యాప్నగరం

SBI డెబిట్ కార్డు వాడే వారికి గుడ్ న్యూస్.. ఉచితంగా రూ.2 లక్షలు బెనిఫిట్!

మీకు ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉందా? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఉచితంగానే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ బెనిఫిట్ లభిస్తోంది. అయితే ఇది జన్ ధన్ ఖాతా కలిగిన వారికే వర్తిస్తుంది.

Samayam Telugu 11 Sep 2021, 3:25 pm
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో సేవింగ్స్ ఖాతా, డెబిట్ కార్డు సేవలు కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. ఎస్‌బీఐ ప్రత్యేకంగా జన్ ధన్ అకౌంట్ సేవలు కూడా ఆఫర్ చేస్తోంది.
Samayam Telugu sbi


ఎస్‌బీఐలో ఉచితంగానే మీరు జన్ ధన్ ఖాతా తెరవొచ్చు. అయితే మీకు మరే ఇతర బ్యాంకుల్లో కూడా సేవింగ్స్ అకౌంట్ ఉండకూడదు. ఎస్‌బీఐ జన్ ధన్ ఖాతా కలిగిన వారికి పలు రకాల బెనిఫిట్స్ లభిస్తున్నాయి. వీటిల్లో ఓవర్ డ్రాఫ్ట్, ఇన్సూరెన్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Also Read: undefined

జన్ ధన్ ఖాతా కలిగిన వారికి రూపే డెబిట్ కార్డు కూడా అందిస్తారు. రూపే డెబిట్ కార్డు కలిగిన వారికి ఉచితంగానే రూ.2 లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది. అయితే డెబిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తూ ఉండాలి. అప్పుడు ఈ బెనిఫిట్ వర్తిస్తుంది.

కేవలం ఎస్‌బీఐలో మాత్రమే కాకుండా ఇతర బ్యాంకుల్లో జన్ ఖాతా ఓపెన్ చేసినా కూడా ఈ ప్రయోజనం లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2014లో జన్ ధన్ యోజన స్కీమ్‌‌ను తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని లాంచ్ చేసింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.