యాప్నగరం

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ప్రత్యేక పథకం.. కస్టమర్లకు అత్యధిక లాభం.. రేపే లాస్ట్ డేట్.. త్వరపడండి!

SBI Amrit Kalash: ఇటీవలి కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును వరుసగా పెంచుకుంటూ పోతోంది. దీంతో బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కస్టమర్ల కోసం ప్రత్యేక పథకాన్ని లాంఛ్ చేసింది.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 30 Mar 2023, 4:24 pm
SBI Amrit Kalash: ఈ రోజుల్లో ప్రజలు ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో స్టాక్ మార్కెట్లు, బ్యాంక్ ఎఫ్‌డీలు, పోస్టాఫీస్, ఎల్‌ఐసీ పథకాలు.. ఇలా ఇంకెన్నో ఉన్నాయి. అయితే ఇందులో బ్యాంక్ ఎఫ్‌డీలపై ఇటీవలి కాలంలో అధిక లాభం వస్తున్న విషయం తెలిసిందే. కారణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుకుంటూ పోతుంటే.. ఇదే క్రమంలో బ్యాంకులు లోన్లపై వడ్డీ పెంచుతూ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. దీంతో.. బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. ఇక జనాన్ని ఆకర్షించేందుకు పలు దిగ్గజ బ్యాంకులు FD పై ప్రత్యేక పథకాల్ని కూడా తీసుకొచ్చాయి. ఇక ప్రభుత్వ మద్దతు ఉంటుంది కాబట్టి.. ప్రభుత్వ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై జనం సాధారణంగానే ఆసక్తి చూపిస్తారు.
Samayam Telugu sbi fd scheme


ఈ ఫిబ్రవరిలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిని అమృత్ కలశ్ (Amrit Kalash) అని పిలుస్తోంది. ఇక ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం కాలవ్యవధి 400 రోజులు. 2023, ఫిబ్రవరి 15న దీనిని లాంఛ్ చేయగా.. ఇక మార్చి 31న ముగుస్తోంది. అంటే అదే లాస్ట్ డే. ఈ ఎఫ్‌డీ స్కీంలో చేరాలంటే ఇంకొక్క రోజే గడువు ఉందన్న మాట.

JP Taparia: దేశంలోనే అత్యంత ఖరీదైన Apartment.. వార్నీ వందల కోట్లతో కొనుగోలు.. Ambani, అదానీ కాదు ఎవరంటే? Gautam Adani: అదానీ ఆశలు ఆవిరి.. ఒక్క రిపోర్ట్‌తో వ్యాపార కోటకు బీటలు.. గొప్ప గొప్ప ఆశయాలన్నీ వెనక్కి.. నెక్ట్స్ ఏంటి?

ఈ అమృత్ కలశ్ డిపాజిట్లపై ఎస్‌బీఐ సాధారణ ప్రజలకు అత్యధికంగా 7.10 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7.60 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇక ఆదాయపు పన్ను చట్టం కింద TDS కూడా వర్తిస్తుంది. ఇక ఈ ఎఫ్‌డీని గడువుకు ముందే ఉపసంహరించుకునే వీలు కూడా ఉంటుంది. లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

ఈ 400 రోజుల వ్యవధి ఉన్న స్కీం కాకుండా.. ఎస్‌బీఐ ఇతర కాలవ్యవధుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ ఎంత ఆఫర్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై SBI సాధారణ ప్రజలకు 3 నుంచి 7 శాతం వడ్డీ ఆఫర్ చేస్తుండగా.. ఇదే సమయంలో సీనియర్ సిటిజెన్లు అదనపు లాభం పొందనున్నారు. వారికి 3.5 శాతం నుంచి 7.5 శాతం వడ్డీ అందిస్తోంది. ఇక ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచే అమల్లోకి వచ్చాయి.

ఎస్‌బీఐ అమృత్ కలశ్ FDతో పాటే మరికొన్ని బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ ఈ నెల 31తో ముగుస్తున్నాయి. HDFC బ్యాంక్ స్పెషల్ స్కీం.. సీనియర్ సిటిజెన్ కేర్ FD కింద ఏడాది నుంచి పదేళ్ల వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీ అందిస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. నాలుగు స్పెషల్ FD పథకాలు కూడా మార్చి 31తోనే ముగియనున్నాయి.

IRCTC eWallet: క్షణాల్లో ట్రైన్ టికెట్ బుకింగ్.. ఐఆర్‌సీటీసీ ఇ వ్యాలెట్‌తోనే సాధ్యం.. దీని గురించి మీకు తెలుసా? UPI New Rules: యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు.. మనపై ప్రభావం ఉండదా? అసలు ఎవరిపై భారం పడుతుంది?

రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.