యాప్నగరం

HDFC, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ.. ఏ బ్యాంక్‌లో డబ్బులు దాచుకుంటే బెస్ట్?

మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే ఏ బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేయాలో అర్థం కావడం లేదా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఏ ఏ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ముందుగా గమనించాలి.

Samayam Telugu 26 Nov 2021, 7:29 am

ప్రధానాంశాలు:

  • ఏ బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేస్తే మేలు?
  • ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకులా?
  • ఎందులో అధిక వడ్డీ వస్తుందంటే..

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi hdfc icici
మీ చేతిలో డబ్బులు ఉన్నాయా? వీటిని బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ FD చేయాలని భావిస్తున్నారా? ఏ బ్యాంక్‌లో డబ్బులు ఎఫ్‌డీ చేయాలో అర్థం కావడం లేదా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ముందుగా ఏ ఏ బ్యాంక్‌లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో గమనించాలి.
దేశీ ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యస్ బ్యాంక్ ఏడాది ఎఫ్‌డీలపై 5.75 శాతం నుంచి వడ్డీని అందిస్తోంది. ఐదేళ్లు లేదా ఆపైన కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 6.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. డీసీబీ బ్యాంక్ కూడా 5.3 శాతం నుంచి 5.9 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది.

యాక్సి్స్ బ్యాంక్ 5.1 శాతం వడ్డీని అందిస్తోంది. గరిష్టంగా 5.75 శాతం వరకు వడ్డీ పొందొచ్చు. ఆర్‌బీఎల్ బ్యాంక్ అయితే 6 శాతం నుంచి 6.3 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. ఎస్‌బీఐ అయితే 5 శాతం నుంచి వడ్డీని అందిస్తోంది. గరిష్టంగా 5.4 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో అయితే 4.9 శాతం నుంచి 5.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో అయితే 4.9 శాతం నుంచి 5.4 శాతం వరకు వడ్డీ పొందొచ్చు.

Also Read: undefined

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.