యాప్నగరం

Credit Cards: బ్యాంక్ షాకింగ్ నిర్ణయం.. ఆ క్రెడిట్ కార్డులన్నీ బ్లాక్.. ఇక వాడడం కుదరదు!

Credit Cards: ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డు వాడకం భారీగా పెరిగింది. బ్యాంకు ఖాతా ఉన్న వారిలో చాలా మంది వద్ద క్రెడిట్ కార్డులు ఉంటున్నాయి. అయితే, వాటిని సరైన విధానంలో వినియోగించినప్పుడే ఉపయోగం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ అనుబంధ సంస్థ ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు మం తెలుసుకుందాం.

Authored byబండ తిరుపతి | Samayam Telugu 4 Apr 2023, 12:13 pm
Credit Cards: క్రెడిట్ కార్డు కస్టమర్లకు అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్‌కు (State Bank Of Mauritius) చెందిన అనుబంధ సంస్థ ఎస్‌బీఎం ఇండియా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా పలు ఫిన్‌టెక్ కంపెనీల భాగస్వామ్యం కుదుర్చుకొని వివిధ రకాల క్రెడిట్ కార్డులను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు అన్ని కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకే ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. నో యువర్ కస్టమర్ (KYC) వివరాలు అప్డేట్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Samayam Telugu Credit Card.


ఇప్పటి వరకు ఎవరైనా నో యువర్ కస్టమర్ వివరాలను అప్డేట్ చేయలేదో వారి కమర్షియల్ క్రెడిట్ కార్డులను బ్యాంక్ బ్లాక్ (Credit Card Block sbm) చేసింది. అంటే కేవైసీ అప్డేట్ చేసుకున్న తర్వాత మళ్లీ ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా క్రెడిట్ కార్డులు తిరిగి వాడుకునేలా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయి. కేవైసీ చేసుకోనివారు ఇకపై కమర్షియల్ క్రెడిట్ కార్డులను వినియోగించుకోలేరు. మార్చి 31 అర్ధరాత్రి నుంచే క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసే ప్రక్రియను బ్యాంక్ మొదలు పెట్టినట్లు సమాచారం. ఏప్రిల్ నెల నుంచి ఎవరైతే ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ఇకపై వాటి సేవలను పొందలేరు.

క్రెడిట్ కార్డులను బ్లాక్ చేస్తున్న విషయాన్ని ఇప్పటికే కస్టమర్లకు అందజేసింది ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియా. ఈ మేరకు ఇ-మెయిల్స్ పంపించినట్లు ఎస్‌బీఎం తెలిపింది. చాలా మందికి చివరి క్షణంలో మెయిల్స్ వచ్చినట్లు కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్‌బీఎం బ్యాంకులో 10 లక్షలకుపైగా క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయి. వీటిల్లో కొన్ని వేల మంది మాత్రమే కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సి ఉందని బ్యాంక్ తెలిపింది. వారికి గడువు కన్నా ముందే సమాచారం అందించినట్లు పేర్కొంది. ఎవరైతే కేవైసీ అప్డేట్ చేసుకోలేదో వారు వెంటనే అప్డేట్ చేసుకోవాలని కోరినట్లు తెలిపింది.

గంతంలోనూ ఝలక్..
ఎస్‌బీఎం బ్యాంక్ ఇండియాకు గతంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఝలక్ ఇచ్చింది. ఔట్ వర్డ్ రెమిటెన్స్ ట్రాన్సాక్షన్లు నిర్వహించకూడదని నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిషేధం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. దీని వల్ల వెస్టెడ్ ఫైనాన్స్, ఇండ్‌మనీ వంటి పలు ఫిన్‌టెక్ సంస్థలపై ప్రభావం పడింది. కొద్ది రోజుల తర్వాత ఆంక్షలను సడలించింది. ఇప్పుడు మరోసారి ఆంక్షలు విధించడం గమనార్హం.

రచయిత గురించి
బండ తిరుపతి
బండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. తిరుపతికి జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.