యాప్నగరం

పసిడి జోరు.. రెండేళ్ల గరిష్టానికి సెన్సెక్స్

యూపీలో బీజేపీ విజయంతో జోరు మీదున్న స్టాక్ మార్కెట్లు ఒక్క రోజు వెనక్కి తగ్గినా గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి.

TNN 16 Mar 2017, 6:39 pm
యూపీలో బీజేపీ విజయంతో జోరు మీదున్న స్టాక్ మార్కెట్లు ఒక్క రోజు వెనక్కి తగ్గినా గురువారం మళ్లీ లాభాల బాట పట్టాయి. అమెరికా వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో భారీ లాభాలను కళ్ల జూశాయి. గురువారం 188 పాయింట్లు బలపడిన సెన్సెక్స్ రెండేళ్ల గరిష్టానికి చేరుకొని 29,586 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 9154 పాయింట్ల గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సూచీలు ఓ దశలో 9,158.45 స్థాయికి చేరుకున్నప్పటికీ చివరికి 9,153.70 వద్ద ముగిశాయి.
Samayam Telugu sensex at 2 year high nifty hits new peak on fed move
పసిడి జోరు.. రెండేళ్ల గరిష్టానికి సెన్సెక్స్


ఊహించినట్లుగానే అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచింది. భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లు పెంచే వీలుందన్న సంకేతాలతో బీఎస్ఈకి చెందిన 20 షేర్లు 0.64 శాతం లాభపడ్డాయి. 2015 జనవరి 29 తర్వాత బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. యూపీ, ఉత్తరాఖండ్‌లలో బీజేపీ తిరుగులేని విజయాలు సాధించడంతో.. మోదీ సర్కారు సంస్కరణలకు తెరతీసే అవకాశం ఉందన్న వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మదుపర్లు ఆసక్తి చూపారు.

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర రూ. 29వేల మార్కును దాటింది. వెండి కూడా ఒక్క రోజులోనే రూ. 1,050 పెరిగింది. గురువారం రూ.450 పెరిగిన 99.9 శాతం స్వచ్ఛమైన పది గ్రాముల పసిడి రూ. 29,100 వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 41,350కు చేరింది.

భారీగా విదేశీ నగదు మార్కెట్లోకి రావడంతో రూపాయి కూడా బలపడింది. ఓ దశలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 65.22 స్థాయికి చేరింది. గత 16 నెలల్లో రూపాయి ఈ స్థాయిలో బలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.