యాప్నగరం

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో స‌రిపెట్టుకున్నాయి. వారాంతం ట్రేడింగ్లో దేశీయ మార్కెట్లు లాభ‌,న‌ష్టాల మ‌ధ్య ఊగిసలాడాయి

Samayam Telugu 6 Apr 2018, 4:29 pm
ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో స‌రిపెట్టుకున్నాయి. వారాంతం ట్రేడింగ్లో దేశీయ మార్కెట్లు లాభ‌,న‌ష్టాల మ‌ధ్య ఊగిసలాడాయి. మొత్తానికి మార్కెట్లు ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్‌ 30 పాయింట్లు పుంజుకుని 33,627 వద్ద నిలవగా.. నిఫ్టీ 6 పాయింట్లు బలపడి 10,332 వ‌ద్ద స్థిర‌ప‌డింది. అయితే కన్సా లిడేషన్‌ బాట పట్టిన మార్కెట్లలో చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపించింది. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.6 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్‌ఈలో ట్రేడైన మొత్తం షేర్లలో 1617 లాభపడగా.. 1065 నష్టాలతో ముగిశాయి.
Samayam Telugu sensex closed with minimum gains in friday trading
స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

అత్య‌ధికంగా న‌ష్ట‌పోయిన ఎయిర్టెల్


బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో లాభ‌ప‌డిన వాటిలో ఐసీఐసీఐ బ్యాంక్(0.97%), టాటా స్టీల్(0.92%), స‌న్ ఫార్మా(0.91%), మారుతి(0.88%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.79%) ముందుండ‌గా మ‌రో వైపు భార‌తి ఎయిర్టెల్(2.17%), ఇన్ఫీ(1.31%), ఎల్ అండ్ టీ(1.31%), బ‌జాజ్ ఆటో(0.96%), ఇండ‌స్ ఇండ్ బ్యాంక్(0.98%), యాక్సిస్ బ్యాంక్(0.49%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.