యాప్నగరం

బీజేపీ గెలుపుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో కొనసాగాయి.

TNN 19 Dec 2017, 5:50 pm
గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కాస్త వెనుకంజ వేయడంతో సోమవారం తొలుత నష్టాల్లోకి వెళ్లి అనంతరం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు మంగళవారం జోరు కొనసాగించాయి. కీలకమైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లకు కొత్త కళ వచ్చింది. మదుపర్లు నమ్మకం ఉంచడంతో మంగళవారం సెన్సెక్స్ 235 పాయింట్ల లాభంతో 33,836 వద్ద ముగిసింది. నిఫ్టీ 74 పాయింట్లు లాభపడి 10,463 స్థాయిలో ముగిసింది.
Samayam Telugu sensex closes 235 points higher at 33836 nifty at 10463 after bjp win in gujarat and himachal
బీజేపీ గెలుపుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు


మారుతీ సుజుకీ లైఫ్ టైం హై స్థాయికి చేరుకొని 9,985 పాయింట్ల వద్ద ముగియడం విశేషం. మారుతి 5.82 శాతం లాభాలను పొందగా.. ఇతర ఆటో స్టాక్‌లు హీరో మోటోకార్ప్ 4.51 శాతం, టాటా మోటార్స్ 3.56 శాతం, బజాజ్ ఆటో 2.8 శాతం లాభపడ్డాయి. రూపాయి కూడా బలపడి మధ్యాహ్నం సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 64.02కు చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.