యాప్నగరం

Stock Market News: కోలుకోని మార్కెట్లు.. నష్టాల్లోనే సూచీలు

ఆరంభంలో ఫ్లాట్‌గా మొదలైన సూచీలు కాసేపటికే మరింత దిగజారాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు కూడా మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి.

Samayam Telugu 21 Nov 2018, 11:14 am
గత ట్రేడింగ్‌లో నష్టాలతో ముగిసిన మార్కెట్లు.. అదే ధోరణిని బుధవారం (నవంబరు 21) కొనసాగించాయి. ట్రేడింగ్‌లో మరోసారి అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఏ దశలోనూ కోలుకోకపోగా మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా ఐటీ, లోహ రంగాల షేర్లకు అమ్మకాల తాకిడి పెరిగింది. ఆరంభంలో ఫ్లాట్‌గా మొదలైన సూచీలు కాసేపటికే మరింత దిగజారాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు కూడా మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి.
Samayam Telugu sensex-down


ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్‌ 323 పాయింట్లు నష్టపోయి 35,145 వద్ద, నిఫ్టీ 82 పాయింట్ల నష్టంతో 10,573 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 19 పైసలు బలపడి 71.46 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యస్ బ్యాంక్, బీపీసీఎల్, ఐవోసీ, యూపీఎల్ తదితర సంస్థల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా.. ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహింద్రా, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్ తదితర సంస్థ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.