యాప్నగరం

Stock Market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

గురువారం నాటి స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. రూపాయి విలువ మరింతగా పతనమవడం, డీజిల్ ధరలు జీవనకాల గరిష్ఠానికి పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి.

Samayam Telugu 30 Aug 2018, 5:17 pm
గురువారం నాటి స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. రూపాయి విలువ మరింతగా పతనమవడం, డీజిల్ ధరలు జీవనకాల గరిష్ఠానికి పెరగడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో ఈ ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 40 పాయింట్లకు పైగా కోల్పోయి ట్రేడింగ్‌ను ఆరంభించింది. మదుపర్ల అప్రమత్తతతో ఒక దశలో సూచీలు 90 పాయింట్ల వరకు కోల్పోయింది. అయితే చివరి గంటల్లో కొనుగోళ్లు జరగడంతో కాస్త కోలుకున్నప్పటికీ స్వల్ప నష్టాలు తప్పలేదు.
Samayam Telugu market 1


ట్రేడింగ్‌లో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు గట్టి మద్దతు లభించింది. పీఎస్‌యూ బ్యాంకులు నిలదొక్కుకున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టాల్లో కొనసాగగా.. మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ముగియడానికి ప్రధాన కారణం.. ఇవాళ ఆగస్టు నెల డెరివేటివ్స్ క్లోజింగ్ కావడమే.

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 33 పాయింట్ల నష్టంతో 38,690 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయి 11,677 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత క్షీణించి 70.74 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో సన్‌ఫార్మా (+3.3 %), గెయిల్‌ (+2.4 %), టాటాస్టీల్‌ (+2 %), ఎన్టీపీసీ (+2 %), యూపీఎల్‌ (+2 %) లిమిటెడ్‌ షేర్లు లాభపడ్డాయి. ఇక నష్టపోయిన నిఫ్టి షేర్లలో ఐషర్ మోటార్స్ ముందుంది. ఈ షేర్ రెండు శాతం నష్టపోయింది. బజాజ్ ఫైనాన్స్, హెచ్ పీసీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ షేర్లు కూడా నష్టాలను చవిచూశాయి. ఇతర షేర్లలో జేపీ పవర్ 18.75 శాతం లాభపడగా, జేపీ అసోసియేట్స్ కూడా 5.86 శాతం లాభంతో ముగిశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.