యాప్నగరం

Stock Market News: రెండోరోజూ మార్కెట్లకు లాభాలే..

ట్రేడింగ్‌లో ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, విద్యుత్తు, ఐటీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి.

Samayam Telugu 27 Nov 2018, 4:36 pm
ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ అనుకూల పరిణామాలతో ఉదయం ట్రేడింగ్ ఫ్లాట్‌గానే ప్రారంభమైనప్పటికీ.. తర్వాత పుంజుకున్న సూచీలు లాభాల్లో పయనించాయి. చమురు ధరలు తగ్గటం కూడా మార్కెట్ లాభాలకు కారణమైంది. ట్రేడింగ్‌లో ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకులు, విద్యుత్తు, ఐటీ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. మరోవైపు ఫార్మా, ఆటోమొబైల్‌, టెలికాం షేర్లు ఒత్తిడికి గురయ్యాయి.
Samayam Telugu markets


ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 35513.14 వద్ద, నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 10685.60 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు సగానికి పైగా లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ స్వల్పంగా (7 పైసలు) బలపడి 70.80 వద్ద కొనసాగుతోంది.

నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇన్ఫోసిస్ (+2.81), బీపీసీఎల్ (+2.49), బజాజ్ ఫిన్‌సర్వ్ (+2.48), టీసీఎస్ (+2.39), హెచ్‌సీఎల్ టెక్ (+2.26) సంస్థలు అధికంగా లాభాలను ఆర్జించగా.. హీరో మోటోకార్ప్ (-3.83), సన్ ఫార్మా (-3.31), యస్ బ్యాంక్ (-2.79), జేఎస్‌డబ్ల్యూ (-2.02), విప్రో (-2.01) సంస్థ షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.