యాప్నగరం

Stock Market: కోలుకున్న రూపాయి.. లాభాల్లో మార్కెట్లు

మార్కెట్లు కోలుకున్నప్పటికీ.. ట్రేడింగ్‌లో 100 పైగా షేర్లు 52 వారాల కనిష్ఠస్థాయికి నష్టపోయాయి. సెంచరీ నష్టాల్లో ప్రారంభమై.. సెంచరీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు...

Samayam Telugu 7 Sep 2018, 5:14 pm
ఆరు రోజుల నష్టాల నుంచి కోలుకున్న దేశీయ మార్కెట్లు వరసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. ఆరంభంలో నష్టాల్లో సాగిన మార్కెట్లు.. ఆ తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల బాట పట్టాయి. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మరోవైపు అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ ఒకదశలో 150 పాయింట్లకు పైగా కోల్పోగా.. నిఫ్టీ 11,500 దిగువకు పడిపోయింది. రూపాయి విలువ కాస్తా పుంజుకోవడంతో సూచీలు క్రమంగా నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లాయి. ఆటోమొబైల్‌, ఫార్మా రంగాల షేర్లకకు కొనుగోళ్లు వెల్లువెత్తాయి.
Samayam Telugu markets


ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 147 పాయింట్లు లాభపడి 38,390 వద్ద, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 11,589 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.71. 74 వద్ద కొనసాగుతోంది. మార్కెట్లు కోలుకున్నప్పటికీ ట్రేడింగ్‌లో 100 పైగా షేర్లు 52 వారాల కనిష్ఠస్థాయికి పడిపోయాయి. బంగారం ధరలో స్వల్ప తగ్గుదల నమోదైంది. 71 పాయింట్లు తగ్గి 30,476 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో హీరోమోటోకార్ప్ (+5.20) , బజాజ్‌ ఆటో(+5.05), ఎయిర్‌టెల్‌(+4.65), లుపిన్‌(+4.52), మహీంద్రా & మహీంద్రా (+4.14) షేర్లు లాభాలు గడించి టాప్ గెయినర్స్‌గా నిలువగా .. యస్‌బ్యాంక్‌(-4.66), అదానీపోర్ట్స్‌(-1.91), పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌(-1.81), సన్‌ఫార్మా(-1.94), హెచ్‌డీఎఫ్‌సీ (-1.85) షేర్లు నష్టాల్లో పయనించి టాప్ లూజర్స్‌గా మిగిలాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.