యాప్నగరం

220 పాయింట్లు లాభ‌ప‌డ్డ సెన్సెక్స్

దేశీయ మార్కెట్లు మళ్లీ కళకళలాడాయి. ఇటీవల నిర్వహించిన జీఎస్‌టీ మండలి సమావేశంలో 88 వస్తువులపై వస్తు, సేవల పన్నును తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు రాణించాయి. సెన్సెక్స్ డ‌బుల్ సెంచ‌రీ సాధించింది.

Samayam Telugu 23 Jul 2018, 5:03 pm
వాణిజ్య వివాదాలు, అంత‌ర్జాతీయంగా మిశ్ర‌మ సంకేతాల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ అధిగమించడం ద్వారా ఇంట్రాడేలో 36,750 వరకూ ఎగసింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. చివరికి 36,719 వద్ద నిలిచింది. వెరసి 222 పాయింట్లు లాభ‌ప‌డ‌గా.. నిఫ్టీ సైతం 74 పాయింట్లు పుంజుకుని 11,085 వద్ద స్థిరపడింది. వెరసి ఆరు నెలల గరిష్టాన్ని అందుకుంది.
Samayam Telugu stock market gains
లాభాల్లో మార్కెట్లు


బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో వీఈడీఎల్(4.42%), అదానీ పోర్ట్స్(3.83%), ఐటీసీ(3.80%), భార‌తీ ఎయిర్‌టెల్(3.49%), ఐసీఐసీఐ బ్యాంక్(3.33%), మారుతి(3.31%) అత్య‌ధికంగా లాభ‌ప‌డ‌గా, మ‌రో వైపు హీరో మోటోకార్ప్(6.20%), బ‌జాజ్ ఆటో(5.35%), విప్రో(2.47%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(1.48%), ఓఎన్‌జీసీ(0.86%), రిల‌య‌న్స్(0.74%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి.

ఎన్‌ఎస్‌ఈలో యూపీఎల్‌, వేదాంతా లిమిటెడ్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, అదానీ పోర్ట్స్‌, ఐటీసీ షేర్లు లాభపడగా.. హీరోమోటార్స్‌, బజాజ్‌ ఆటో, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, గ్రాసిమ్‌ షేర్లు నష్టపోయాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.