యాప్నగరం

Stock Market: బలపడ్డ రూపాయి.. మార్కెట్లకు జోష్

మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గుచూపడంతోపాటు డాలర్‌తో రూపాయి విలువ బలపడటంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

Samayam Telugu 14 Sep 2018, 10:28 am
క్రితం సెషన్‌లో భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు.. శుక్రవారం ఆరంభ లాభాలతో అదే జోరును కొనసాగిస్తున్నాయి. ఆరంభంలో 270 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్ ఉదయం 10.10 గంటల సమయానికి 248 పాయింట్ల లాభంతో 37,961 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ కూడా మళ్లీ 11,400 మార్క్‌ను దాటి లాభాల్లో సాగుతోంది. 88 పాయింట్ల లాభంతో 11,458 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అమెరికా డాలర్‌కు డిమాండ్‌ తగ్గడంతో దేశీయ కరెన్సీ రూపాయి క్రమంగా బలపడుతోంది.
Samayam Telugu market


బుధవారం నాటి సెషన్‌లో 51 పైసలు కోలుకుని 72.18 వద్ద ముగిసిన రూపాయి.. శుక్రవారం ట్రేడింగ్‌ను బలంగా ప్రారంభించింది. ఆరంభ ట్రేడింగ్‌లో 50పైసలు లాభపడి 71.68గా కొనసాగింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.78 వద్ద కొనసాగుతోంది.

నేటి ట్రేడింగ్‌లో మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గుచూపడంతోపాటు డాలర్‌తో రూపాయి విలువ బలపడటం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌కు కలిసొచ్చింది. దీంతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు లాభాలతో ప్రారంభించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, మౌలిక, లోహ, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి.

ఎన్‌ఎస్‌ఈలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, సన్‌ఫార్మా, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం, యస్‌బ్యాంక్ తదితర షేర్లు లాభాల్లో ఉండగా.. టెక్‌మహింద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్, టీసీఎస్‌ తదితర షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.