యాప్నగరం

Stock Market: భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు!

రెండురోజుల నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచే పాజిటివ్‌గా స్పందించిన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి.

Samayam Telugu 3 Aug 2018, 4:26 pm
రెండురోజుల నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచే పాజిటివ్‌గా స్పందించిన సూచీలు చివరి వరకు అదే జోరును కొనసాగించాయి. ఉదయం సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. ఒక దశలో 400 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి 391 పాయింట్ల లాభంతో 37,556.16 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల లాభంతో 11,360 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 8 పైసలు బలపడి 68.79 వద్ద ముగిసింది. బంగారం ధరలు అతి స్వల్పంగా తగ్గాయి.
Samayam Telugu bse


ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణగడం, ఆర్‌బీఐ వడ్డీరేట్ల ప్రభావం తగ్గడంతో మదుపర్లు కొనుగోళ్లవైపు మొగ్గు చూపడంతో ఏర్పడ్డ మంచి వాతావరణంలో సూచీలు దూసుకుపోయాయి. జీఎస్టీ రేటు కోత, త్రైమాసిక ఫలితాలు కూడా లాభాలకు కారణమయ్యాయి.

యాక్సిస్‌ బ్యాంకు, వేదాంతా, యస్‌బ్యాంక్‌, గెయిల్‌, ఐబీ హౌసింగ్‌, ఐసీఐసీఐ,హెచ్‌డీఎఫ్‌సీ, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, కొటక్‌ బ్యాంక్‌ షేర్లు భారీగా లాభపడ్డాయి. మరోవైపు టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్‌, గ్రాసిమ్‌, హీరోమోటో, ఇండస్‌ఇండ్, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.