యాప్నగరం

న‌ష్టాల‌తో ముగిసిన దేశీయ మార్కెట్లు

టర్కీ ప్రకంపనలు, డాలరుతో మారకంలో రూపాయి పతనం వంటి ప్రతికూల అంశాలు దేశీయ‌ స్టాక్‌ మార్కెట్లను దెబ్బకొట్టాయి

Samayam Telugu 16 Aug 2018, 4:55 pm
టర్కీ ప్రకంపనలు, డాలరుతో మారకంలో రూపాయి పతనం వంటి ప్రతికూల అంశాలు దేశీయ‌ స్టాక్‌ మార్కెట్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపాయి. అమెరికా సహా ఆసియా వరకూ మార్కెట్లు బలహీనపడటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనయ్యారు. దీంతో దేశీయంగానూ మార్కెట్లు రోజంతా నేలచూపులకే పరిమితమయ్యాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 188 పాయింట్లు క్షీణించి 37,663కు చేరగా.. నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 11,385 వద్ద స్థిరపడింది.
Samayam Telugu న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్లు


బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో స‌న్ ఫార్మా(2.98%), భార‌తీ ఎయిర్టెల్(1.51%), ఇన్ఫీ(1.17%), టాటా మోటార్స్(0.99%), యాక్సిస్ బ్యాంక్(0.90%), ఎన్‌టీపీసీ(0.83%) లాభాల్లో ముగియ‌గా, మ‌రో వైపు కొట‌క్ బ్యాంక్(3.62%) , వీఈడీఎల్‌(3.05%)అత్య‌ధికంగా.., హెచ్‌డీఎఫ్‌సీ(2.61%), టాటా స్టీల్‌(1.87%), ఎల్ అండ్ టీ(1.64%), విప్రో(1.60%) వంటివి స్వ‌ల్ప న‌ష్టాల‌తో స‌రిపెట్టుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.