యాప్నగరం

Stock Market Today: ఒడుదొడుకుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు!

అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, చైనా ఆర్థిక మందగమనం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

Samayam Telugu 9 Oct 2018, 11:42 am
మంగళవారం (అక్టోబరు 9) దేశీయ స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. 150 పైగా పాయింట్ల లాభాలతో ప్రారంభమైనా సెన్సెక్స్ ట్రేడింగ్ తొలి గంటలోపే నష్టాల్లోకి మళ్లింది. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో సూచీలు నష్టాల బాటపట్టాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, చైనా ఆర్థిక మందగమనం ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ట్రేడింగ్‌లో ఫార్మా, మెటల్ షేర్లు లాభాల్లోనూ, ఆటో షేర్లు నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.
Samayam Telugu stocks


ఉదయం 11.30 గంటల సమయానికి సెన్సెక్స్ 69.42 పాయింట్ల నష్టంతో 34,428.83 వద్ద, నిఫ్టీ 23.25 పాయింట్ల లాభంతో 10,324 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.08 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ, యస్ బ్యాంక్, వేదాంత, అదానీ పోర్ట్స్,జీ ఎంటర్‌టెయిన్‌మెంట్, బజాజ్ ఫినాన్స తదితర షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు టాటా మోటార్స్, ఐచర్ మోటార్స్, గ్రాసిమ్, టైటన్ కంపెనీ, హెచ్‌పీసీఎల్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ 57 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నష్టపోతున్న వాటిల్లో ఐచర్ మోటార్స్ అత్యధికంగా 901 పాయింట్లు కోల్పోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.