ఇండియన్ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాలతో దూసుకెళ్తోంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గ్యాప్‌అప్‌తోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 38,233 పాయింట్లతో పోలిస్తే 139 పాయింట్ల లాభంతో 38,372 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,483 పాయింట్లతో పోలిస్తే 48 పాయింట్ల లాభంతో 11,531 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. సమయం గడిచేకొద్ది ఇండెక్స్ లాభాలు మరింత పెరిగాయి. ఉదయం 9:25 సమయంలో సెన్సెక్స్ 190 పాయింట్ల లాభంతో 38,424 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 11,528 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఎల్అండ్టీ, యస్ బ్యాంక్, ఐఓసీ, సన్ ఫార్మా, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారతీ ఇన్ఫ్రాటెల్, వేదాంత, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ దాదాపు 3 శాతం పెరిగింది.
అదేసమయంలో ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్, టెక్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా, యూపీఎల్, బీపీసీఎల్, గ్రాసిమ్, హీరో మోటొకార్ప్ షేర్లు నష్టా్ల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ 1 శాతానికి పైగా క్షీణించింది.
సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ దాదాపుగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఒక్క నిఫ్టీ రియల్టీ మాత్రం నష్టాల్లో ఉంది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యా్ంక్ ఇండెక్స్ 1 శాతానికి పైగా పెరిగింది.
మరోవైపు ఇండియన్ రూపాయి బుధవారం నష్టాల్లో ప్రారంభమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసల నష్టంతో 68.99 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. రూపాయి మంగళవారం ముగింపు 68.86గా ఉంది.