యాప్నగరం

Sensex Today: నిఫ్టీ @ 11,000

విప్రో, భారతీ ఇన్‌‌ఫ్రాటెల్, హెచ్‌పీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐఓసీ, వేదాంత, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీపోర్ట్స్, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. విప్రో 3 శాతానికి పైగా పెరిగింది.

Samayam Telugu 6 Mar 2019, 9:50 am

ప్రధానాంశాలు:

  • లాభాల్లో ప్రారంభమైన సూచీలు
  • 100 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్
  • నిఫ్టీ 40 పాయింట్లు అప్
  • ఆటో రంగ షేర్లు మినహా అన్నింటిలోనూ కొనుగోళ్ల జోరు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu nifty
ఇండియన్ స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ట్రేడవుతోంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 36,443 పాయింట్లతో పోలిస్తే 102 పాయింట్ల లాభంతో 36,545 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,987 పాయింట్లతో పోలిస్తే 38 పాయింట్ల లాభంతో 11,025 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది.
ఉదయం 9:39 సమయంలో సెన్సెక్స్ 122 పాయింట్ల లాభంతో 36,564 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 11,029 వద్ద ట్రేడవుతున్నాయి.

నిఫ్టీ 50లో విప్రో, భారతీ ఇన్‌‌ఫ్రాటెల్, హెచ్‌పీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐఓసీ, వేదాంత, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, అదానీపోర్ట్స్, ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. విప్రో 3 శాతానికి పైగా పెరిగింది.

అదేసమయంలో సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. సన్ ఫార్మా, హీరో మోటొకార్ప్ షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి.

సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఆటో మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ గరిష్టంగా 1 శాతానికి పైగా ర్యాలీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.