యాప్నగరం

MSMEs : ఆర్‌బీఐ తీపికబురు.. కీలక ప్రకటన చేసిన శక్తికాంత్ దాస్!

తాజా పాలసీ సమీక్షలో జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతంగా కొనసాగవచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. అదేసమయంలో ద్రవ్యోల్బణం 5 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. కాగా కొంత మంది ఆర్‌బీఐ ఈసారి రివర్స్ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు. అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం వడ్డీ రేట్లను ఈసారి కూడా స్థిరంగానే కొనసాగించింది. ఎలాంటి మార్పు చేయకపోవడం గమనార్హం.

Samayam Telugu 10 Feb 2022, 12:29 pm

ప్రధానాంశాలు:

  • ఆర్‌బీఐ ముఖ్యమైన నిర్ణయం.. న్యాక్ మ్యాండేట్ లిమిట్ పెంచుతూ నిర్ణయం
  • అలాగే కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగింపు
  • వరుసగా పదోసారి వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిన రిజర్వు బ్యాంక్
  • అలాగే ఇరూపీ లిమిట్‌కు రూ.లక్షకు పెంచిన ఆర్‌బీఐ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu shaktikanta das
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI వ్యాపారులకు తీపికబురు అందించింది. న్యాక్ మ్యాండేట్ లిమిట్‌ను పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. ఈ లిమిట్‌ను రూ.కోటి నుంచి రూ.3 కోట్లకు పెంచుతామని వెల్లడించారు. టీఆర్‌ఈడీఎస్ సంబంధిత సెటిల్‌మెంట్లకు ఇది వర్తిస్తుంది. పరిశ్రమ వర్గాల నుంచి అందిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని ఎంఎస్ఎంఈలకు పెరుగుతున్న ద్రవ్య అవసరాలకు ఫైనాన్సింగ్ సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
అలాగే ఆర్‌బీఐ మరో శుభవార్త కూడా అందించింది. ఇరూపీ వోచర్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను మరింత మెరుగ్గా అందజేసేందుకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ ప్రకటన చేశారు. ఇరూపీ వోచర్‌ను లిమిట్‌ను రూ. 10 వేల నుంచి రూ. లక్షకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఎన్‌పీసీఐకి ఆదేశాలు జారీ చేస్తామని ఆర్‌బీఐ వెల్లడించింది. అంతేకాకుండా ఇకపై ఇరూపీ వోచర్‌ను ఎన్ని సార్లు అయినా ఉపయోగించొచ్చు.

Also Read: undefined

ఇకపోతే ఆర్‌బీఐ వరుసగా పదో సారి కూడా వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని మానిటీరీ పాలసీ కమిటీ ఈరోజు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగానే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 4 శాతంగా వద్దనే ఉంది. రివర్స రెపో 3.35 శాతం వద్ద కొనసాగుతోంది. అదేసమయంలో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతం వద్ద కొనసాగుతోంది.

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చివరిగా 2020 మే 22న వడ్డీ రేట్లను సవరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ రేట్లు నిలకడగానే ఉంటూ వస్తున్నాయి. అలాగే తాజా పాలసీ సమీక్షలో జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.8 శాతంగా కొనసాగవచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. అదేసమయంలో ద్రవ్యోల్బణం 5 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేసింది. కాగా కొంత మంది ఆర్‌బీఐ రివర్స్ రెపో రేటును పెంచొచ్చని అంచనా వేశారు. అయితే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం వడ్డీ రేట్లను ఈసారి కూడా స్థిరంగానే కొనసాగించింది. ఎలాంటి మార్పు చేయలేదు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.