యాప్నగరం

Electric Scooter: అంతా ఎదురుచూసే సింపుల్ వన్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 212 కి. మీ. జర్నీ!

Electric Scooter: ఎలక్ట్రిక్ టూవీలర్ వాహన తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ.. తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను (Simple ONE Electric Scooter) ఎట్టకేలకు ఇండియాలో లాంఛ్ చేసింది. ఇక దీని ఫీచర్లు.. ధర, బ్యాటరీ రేంజ్ వంటి వివరాలు తెలుసుకుందాం.

Authored byపూర్ణచందర్ తూనం | Samayam Telugu 6 Jun 2023, 10:14 am
Electric Scooter: ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. పెట్రోల్ అవసరం లేకుండా ఉండటం, కాలుష్య రహితం కావడం వల్ల వీటివైపు మొగ్గుచూపుతున్నారు. ఇక విద్యుత్ వాహనాలు కొనుగోలు చేయాలనుకునేవారు.. చాలా రోజుల నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవాళ (మంగళవారం) భారత్‌లో విడుదలైంది. సింపుల్ ఎనర్జీ ఈ స్కూటర్‌ను 2021 ఆగస్టులోనే ఆవిష్కరించింది. ఏదో ఒక అప్‌డేట్‌తో వాహన ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తూనే వచ్చింది. కస్టమర్స్ కోసం మెరుగైన అనుభూతి, సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేందుకు సుదీర్ఘ కాలం పాటు టెస్ట్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది కంపెనీ.
Samayam Telugu simple one


రీసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పైనే సింపుల్ వన్ చాలా సమయం, డబ్బు వెచ్చించిందని చెప్పారు సింపుల్ వన్ ఎనర్జీ ఫౌండర్, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్. సుదీర్ఘ దూరం, ఫాస్ట్ టెక్నాలజీ, రెండు బ్యాటరీలు, స్మార్ట్.. వంటివి ఈ స్కూటర్ ప్రత్యేకతలు అని అన్నారు. IP67 రేటింగ్‌తో ఉన్న 5kWh లిథియం అయాన్ డ్యుయల్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నట్లు తెలిపారు. దేశీయంగానే 95 శాతం పరికరాలను సమకూర్చుకున్నట్లు వివరించారు.



ఇక సింపుల్ వన్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో 7 ఇంచుల డిజిటల్ డిస్‌ప్లే ఇస్తున్నట్లు తెలిపింది కంపెనీ. నేవిగేషన్, డాక్యుమెంట్ స్టోరేజ్, బ్యాటరీ రేంజ్ డీటెయిల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్ వంటి వివరాలు డిస్‌ప్లేపైనే కనిపిస్తాయని వివరించింది. నిమిషంలోనే 1.5 కిలోమీటర్లు ప్రయాణించేందుకు కావాల్సిన ఛార్జింగ్ అవుతుందని చెప్పింది. ఇలా ఇంట్లో 5 గంటల 54 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుందని తెలిపింది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని పేర్కొంది. 2.77 సెకన్లలోనే.. గంటకు 40 కి.మీ. వేగం అందుకుంటుందని స్పష్టం చేసింది. 6 రంగుల్లో ప్రస్తుతం ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.

ఇక ధర విషయానికి వస్తే. సింపుల్ వన్ స్కూటర్ రూ.1.45 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. 750 వాట్ పోర్టబుల్ ఛార్జర్‌కు అదనంగా రూ.13 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మొదట జూన్ 6 నుంచి బెంగళూరులో డెలివరీలు ప్రారంభం కానుండగా.. ఆ తర్వాత క్రమక్రమంగా ఇతర నగరాల్లో ఈ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.

ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. బాధలో ఐటీ ఉద్యోగులు.. మరీ ఇలా చేస్తుందని అనుకుంటారా?

రూ. 2 వేల నోటు ఉపసంహరణతో కలిగే లాభాలు ఇవే.. కేంద్రం అసలు స్కెచ్ అదేనా?


రచయిత గురించి
పూర్ణచందర్ తూనం
తూనం పూర్ణ చందర్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ రోజూ బిజినెస్‌ రంగానికి సంబంధించిన వార్తలు రాస్తుంటారు. పర్సనల్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్లు అందిస్తుంటారు. పూర్ణచందర్‌కు జర్నలిజంలో ఐదేళ్లకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో బిజినెస్, నేషనల్, స్పోర్ట్స్ డెస్కుల్లో పనిచేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.