యాప్నగరం

స్పైస్ జెట్... సూపర్ ఆఫర్

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ వార్షిక సేల్ ను ప్రకటించింది.

TNN 21 Nov 2016, 7:43 pm
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ వార్షిక సేల్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా కొన్ని రూట్లలో చాలా తక్కువ ధరకే ప్రయాణం చేయొచ్చు. కేవలం రూ.737కే (అన్ని ట్యాక్స్ లు కలిపి) టిక్కెట్ ధరను నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 09 నుంచి అక్టోబర్ 28,2017 మధ్య ప్రయాణం చేయాలనుకునేవారు ఈ ధరలకు టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. అన్ని రూట్లలో కాదు... కేవలం స్పైస్ జెట్ ప్రకటించిన రూట్లలోనే. అవి చెన్నై-కోయంబత్తూరు - చెన్నై, జమ్మూ-కాశ్మీర్ - జమ్మూ, చండీఘడ్ - శ్రీనగర్ - చంఢీఘడ్, అగర్తలా - గౌహతి రూట్లు. నవంబర్ 21 నుంచి నవంబర్ 24 అర్థరాత్రి వరకు ఈ ఆఫర్ లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని స్పైస్ జెట్ తెలిపింది. అలాగే తాము పాత కరెన్సీ రూ.500, రూ.1000 నోట్లను కూడా తమ కౌంటర్ల వద్ద తీసుకుంటామని చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.