యాప్నగరం

SBIలో అకౌంట్ ఉందా? నెలకు రూ.28తో రూ.4 లక్షల బెనిఫిట్ పొందండిలా!

PMSBY | మీకు స్టేట్ బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు ఈ స్కీమ్స్‌లో చేరండి. నెలకు రూ.28 పొదుపుతో ఏకంగా రూ.4 లక్షల వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఎలానో తెలుసుకోండి.

Samayam Telugu 20 Sep 2021, 10:19 am

ప్రధానాంశాలు:

  • ఎస్‌బీఐలో రెండు స్కీమ్స్
  • చేరితే రూ.4 లక్షల బెనిఫిట్
  • రూ.28 పొదుపు చేస్తే చాలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu sbi news
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల సర్వీసులు కూడా ఉన్నాయి. కేంద్రం అందించే పలు స్కీమ్స్‌ను ఎస్‌బీఐ తన కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.
వీటిల్లో రెండు స్కీమ్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీటిల్లో నెలకు రూ.28 చెల్లిస్తే.. ఏకంగా రూ.4 లక్షల బెనిఫిట్ పొందొచ్చు. ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన PMSBY అనేవి ఇవి.

Also Read: undefined

ఇవి రెండూ ఇన్సూరెన్స్ స్కీమ్స్. ఈ రెండు స్కీమ్స్‌లో చేరితే ఏడాదికి రూ.342 చెల్లిస్తే సరిపోతుంది. సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.12 కట్టాలి. దీని ద్వారా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద రూ.2 లక్షల వరకు కవరేజ్ లభిస్తుంది. అలాగే జీవన్ జ్యోతి బీమా యోజనకు ఏడాదికి రూ.330 చెల్లించాలి. దీని ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా కవరేజ్ లభిస్తుంది.

బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ బెనిఫిట్ లభిస్తుంది. అయితే మీరు ప్రతి సంవత్సరం మీ బ్యాంక్ అకౌంట్‌లో సరిపడా రూ.350 డబ్బులు కలిగి ఉండాలి. అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గానే ప్రీమియం డబ్బులు కట్ అవుతాయి. అప్పుడు మీకు రూ.4 లక్షల బెనిఫిట్ లభిస్తుంది. లేదంటే లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.