యాప్నగరం

గృహ‌ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ‌ రుణాలపై వడ్డీ రేటు 0.9 శాతం మేర తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 9.10 శాతాన్ని 8.6 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

TNN 2 Jan 2017, 10:56 am
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ‌ రుణాలపై వడ్డీ రేటు 0.9 శాతం మేర తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 9.10 శాతాన్ని 8.6 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు ద్వారా సమకూరిన ఫలాలను పేద, మధ్యతరగతి ప్రజలకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబరు 31 న జాతినుద్దేశించి ప్రసంగించిన సందర్భంలో పేర్కొన్నారు. అలాగే గృహ‌ రుణాలపై వడ్డీని తగ్గించనున్నట్లు ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
Samayam Telugu state bank of india reduced housing loan interest rates
గృహ‌ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ


దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించనున్నాయి. ఎస్బీఐ‌తోపాటు మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు కూడా వడ్డీ రేటులో కోత విధించాయి. రూ.75 లక్షల వరకు రుణాలపై 9.1 శాతంగా వడ్డీ రేటు తగ్గించిన ప్రకారం 8.6 శాతం వసూలు చేస్తారు. ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ కూడా తన వడ్డీ రేట్లను తగ్గించే సూచనలు కనిపిస్తున్నాయి. ఏడాది కాలపరిమితికి తీసుకున్న రుణగ్రహీతలకు కూడా ఈ వడ్డీరేటు వర్తిస్తుంది. జనవరి 1 నుంచి ఈ నిబంధనలు వర్తిస్తాయని ఎస్బీఐ వర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.