యాప్నగరం

కనీస నిల్వలపై ఛార్జీలు తగ్గించిన 'ఎస్‌బీఐ'..!

కనీస నిల్వలపై ఛార్జీల పేరుతో ఖాతాదారుల నుంచి వేలకోట్ల రూపాయలు వసూలు చేస్తోందంటూ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై విమర్శలు రావడంతో... బ్యాంకు నష్టనివారణ చర్యలకు దిగింది. తాజాగా తన ఖాతాదారుల తీపికబురు అందిస్తూ... కనీస నిల్వలపై ఛార్జీలను 75శాతం వరకు తగ్గించింది.

TNN 13 Mar 2018, 1:09 pm
కనీస నిల్వలపై ఛార్జీల పేరుతో ఖాతాదారుల నుంచి వేలకోట్ల రూపాయలు వసూలు చేస్తోందంటూ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై విమర్శలు రావడంతో... బ్యాంకు నష్టనివారణ చర్యలకు దిగింది. తాజాగా తన ఖాతాదారుల తీపికబురు అందిస్తూ... కనీస నిల్వలపై ఛార్జీలను 75శాతం వరకు తగ్గించింది. ఎస్‌బీఐ కేవలం ఎనిమిది నెలల కాలంలోనే కనీస నిల్వలపై ఛార్జీల పేరుతో ఖాతాదారుల నుంచి రూ.1,771 కోట్లు ఆర్జించిందని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu state bank of india slashes charges for transferring funds by up to 75 percent
కనీస నిల్వలపై ఛార్జీలు తగ్గించిన 'ఎస్‌బీఐ'..!


ఈ నిర్ణయం అమల్లోకి వస్తే... కనీస నిల్వలపై ఛార్జీలు... మెట్రో, అర్బన్ కేంద్రాల్లో రూ.50గా ఉన్న ఛార్జీలు రూ.15గా మారనున్నాయి.సెమీ- అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో రూ.40గా ఉండగా... ఇకనుంచి సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.12, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వసూలు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి తగ్గించిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.

ఎస్‌బీఐ ఖాతాదారుల సంఖ్య 41 కోట్లుగా ఉంది. వీటిలో 16 కోట్ల ఖాతాలు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, బీఎస్‌బీడీ, పెన్షన్లు, మైనర్లు, సామాజిక భద్రతకు సంబంధించినవే... ఈ ఖాతాలకు ఎలాంటి కనీస నిల్వ ఛార్జీలు వర్తించవు.

కనీస నిల్వల వివరాలు
ప్రాంతం కనీస నిల్వ ఛార్జీలు
మెట్రో నగరాలు రూ.3,000 రూ.15
అర్బన్ ప్రాంతాలు రూ.3,000 రూ.15
సెమీ అర్బన్ రూ.2,000 రూ.12
గ్రామీణ ప్రాంతాలు రూ.1,000 రూ.10

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.