యాప్నగరం

రిలయన్స్ దన్ను.. దుమ్మురేపిన మార్కెట్!

Rupee | బుల్ రంకెతో దలాల్‌స్ట్రీట్ దద్దరిల్లింది. బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. మార్కెట్ పైపైకి కదిలింది. మరోవైపు రూపాయి కూడా స్వల్పంగా రికవరీ బాట పట్టింది. క్రూడ్ ధరలు మిశ్రమంగా కదలాడుతున్నాయి.

Samayam Telugu 22 Apr 2020, 5:05 pm

ప్రధానాంశాలు:

  • స్టాక్ మార్కెట్ ర్యాలీ
  • సెన్సెక్స్ 700 పాయింట్లు పైకి
  • 9100 పైని నిఫ్టీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu market close
దేశీ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు బుధవారం దుమ్మురేపాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ చేయడం మార్కెట్‌కు కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. ఫేస్‌బుక్- రిలయన్స్ జియో డీల్ కారణంగా ఆర్‌ఐఎల్ షేర్లు భారీగా పెరిగాయి. రిలయన్స్ వంటి హెవీవెయిట్ షేరు సహా ఆటో షేర్లలో లాభాలు మార్కెట్‌కు కలిసొచ్చాయి.
ఇంట్రాడేలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 31,471 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 9209 పాయింట్లకు చేరింది. చివరకు సెన్సెక్స్ 743 పాయింట్ల లాభంతో 31,380 పాయింట్ల వద్ద, నిఫ్టీ 206 పాయింట్ల లాభంతో 9187 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 10 శాతం పెరుగుదలతో రూ.1364 స్థాయికి చేరింది.

Also Read: undefined

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో జీ ఎంటర్‌టైన్‌మెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూపీఎల్ షేర్లు పెరిగాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేరు ధర ఏకంగా 20 శాతం ర్యాలీ చేసింది.

✺ అదేసమయంలో ఓఎన్‌జీసీ, వేదాంత, ఎల్అండ్‌టీ, సిప్లా, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. ఓఎన్‌జీసీ 6 శాతం పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు నష్టపోయాయి. ఇక మిగతా ఇండెక్స్‌లన్నీ లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ మీడియా 6 శాతానికి పైగా పరుగులు పెట్టింది.

Also Read: undefined

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 16 పైసలు లాభంతో 76.67 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.72 శాతం పెరుగుదలతో 19.47 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.99 శాతం క్షీణతతో 11.33 డాలర్లకు తగ్గింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.