యాప్నగరం

పదేళ్లలో అతిపెద్ద లాభం.. ఒకే రోజు రూ.8 లక్షల కోట్లు వచ్చేశాయ్!

Rupee | బుల్ రంకేసింది. దలాల్ స్ట్రీట్ దద్ధరిల్లింది. బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నడుమ మార్కెట్ దుమ్మురేపింది. మరోవైపు క్రూడ్ ధరలు పెరిగాయి. రూపాయి కూడా లాభపడింది.

Samayam Telugu 7 Apr 2020, 4:37 pm

ప్రధానాంశాలు:

  • భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
  • సెన్సెక్స్ 2,400 పాయింట్లు పైకి
  • 9 శాతం పెరిగిన నిఫ్టీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu market close
దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. బెంచ్‌మార్క్ సూచీలు మంగళవారం పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ సానుకూల పరిస్థితుల నేపథ్యంలో మన మార్కెట్ దూసుకెళ్లింది. సెన్సెక్స్ మళ్లీ 30 వేల పాయింట్ల పైకి వచ్చేసింది. నిఫ్టీ కూడా 9 వేల పాయింట్ల సమీపంలోకి వచ్చింది. అమెరికా, యూరప్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌పై కూడా పడింది.
సెన్సెక్స్ 2476 పాయింట్ల మేర ర్యాలీ చేసింది. 30,067 పాయింట్లకు చేరింది. ఇండెక్స్ ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం 10 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.8 లక్షల కోట్లు పెరిగింది. అలాగే నిఫ్టీ కూడా 9 శాతం లాభంతో 8792 పాయింట్ల స్థాయికి చేరింది.

Also Read: undefined

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిమ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హిందుస్తాన్ యూనిలివర్ షేర్లు పరుగులు పెట్టాయి. ఇవ్వన్నీ14 శాతం నుంచి 25 శాతం మధ్యలో పెరిగాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 25 శాతం ర్యాలీ చేసింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌లు 10 శాతానికి పైగా ర్యాలీ చేసింది. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 11 శాతం పైకి కదిలింది. నిఫ్టీ ఆటో 9 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 8 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 8 శాతం, నిఫ్టీ మెటల్ 6 శాతం, నిఫ్టీ ఐటీ 7 శఆతం, నిఫ్టీ రియల్టీ 6 శాతం చొప్పున పరుగులు పెట్టాయి.

Also Read: undefined

✺ ఇకపోతే అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 33 పైసలు లాభంతో 75.63 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.39 శాతం పెరుగుదలతో 33.84 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 3.3 శాతం పెరుగుదలతో 26.94 డాలర్లకు ఎగసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.