యాప్నగరం

బ్యాంకులు అదరగొట్టాయి.. దుమ్మురేపిన మార్కెట్!

Rupee | బెంచ్‌మార్క్ సూచీలు దుమ్ముదులిపాయి. దలాల్ స్ట్రీట్ దద్దరిల్లింది. మార్కెట్ పరుగులు పెట్టింది. అదేసమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూాపాయి దాదాపు ప్లాట్‌గానే ఉంది. క్రూడ్ ధరలు పెరిగాయి.

Samayam Telugu 18 Jun 2020, 4:48 pm

ప్రధానాంశాలు:

  • లాభాల్లో స్టాక్ మార్కెట్
  • సెన్సెక్స్ 700 పాయింట్లు ర్యాలీ
  • నిఫ్టీ డబుల్ సెంచరీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu market close
దేశీ స్టాక్ మార్కెట్ పరుగులు పెట్టింది. మార్కెట్ అదరగొట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు గురువారం లాభాల్లోనే క్లోజయ్యాయి. హెవీ వెయిట్ షేర్లు ర్యాలీతో మార్కెట్‌కు కలిసొచ్చింది. వీక్లి ఇండెక్స్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఈరోజు ఎక్స్‌పైరీ కావడం వల్ల షార్ట్ కవరింగ్‌తో మార్కెట్ ర్యాలీ చేసిందని చెప్పుకోవచ్చు.
ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 768 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ కూడా 10,111 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు వచ్చేసరికి సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 34,208 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 210 పాయింట్ల లాభంతో 10,092 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.

Also Read: undefined

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, వేదాంత షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ ఏకంగా 8 శాతం పరుగులు పెట్టింది.

✺ టీసీఎస్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. టీసీఎస్ దాదాపు 1 శాతం పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా క్లోజయ్యాయి. నిఫ్టీ ఫార్మా మినహా మిగతా ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే ఉన్నాయి. నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 3 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2.5 శాతం, నిఫ్టీ మెటల్ 3 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.6 శాతం, నిఫ్టీ బ్యాంక్ 3.7 శాతం చొప్పున లాభపడ్డాయి.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. 76.17 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 1.18 శాతం పెరుగుదలతో 41.19 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.82 శాతం పెరుగుదలతో 38.24 డాలర్లకు ఎగసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.