యాప్నగరం

దుమ్మురేపిన బ్యాంకులు.. మార్కెట్‌కు భారీ లాభాలు!

Rupee | దేశీ స్టాక్ మార్కెట్ అదరగొట్టింది. బెంచ్‌మార్క్ సూచీలు దుమ్మురేపాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. అయితే ముడి చమురు ధరలు మాత్రం మిశ్రమంగా కదిలాయి.

Samayam Telugu 1 Jun 2020, 4:40 pm

ప్రధానాంశాలు:

  • స్టాక్ మార్కెట్ పరుగు
  • సెన్సెక్స్ 870 పాయింట్లు పైకి
  • 9,800 పైకి నిఫ్టీ

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu market news
దేశీ స్టాక్ మార్కెట్ దుమ్మురేపింది. బెంచ్‌మార్క్ సూచీలు పరుగులు పెట్టాయి. సోమవారం మార్కెట్ భారీగా లాభపడింది. కేంద్ర ప్రభుత్వం రెండు నెలల తర్వాత కోవిడ్ 19 లాక్ డౌన్‌ నిబంధనలను కొంత సడలించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్ పైకి కదిలింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1250 పాయింట్లు వరకు లాభపడింది. నిఫ్టీ కూడా 9932 పాయింట్ల వరకు ఎగబాకింది. హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్ల జోరు కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. చివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 879 పాయింట్ల లాభంతో 33,304 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9826 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

Also Read: undefined

Stock Market Highlights..

✺ నిఫ్టీ 50లో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటన్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఫైనాన్స్ ఏకంగా 10 శాతానికి పైగా పరుగులు పెట్టింది.

✺ అదేసమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, భారతీ ఇన్‌ఫ్రాటెల్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా షేర్లు నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3 శాతం పడిపోయింది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ లాభాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ దుమ్మురేపింది. ఏకంగా 7 శాతానికి పైగా పెరిగింది. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌లు 3 శాతానికి పైగా లాభపడ్డాయి.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభాల్లో ట్రేడవుతోంది. 7 పైసలు లాభంతో 75.55 వద్ద కదలాడుతోంది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.58 శాతం పెరుగుదలతో 38.06 డాలర్లకు చేరింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.31 శాతం క్షీణతతో 35.38 డాలర్లకు దిగొచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.