యాప్నగరం

బజాజ్ అవేంజర్‌కు పోటీగా సుజుకి ఇంట్రూడర్

భారత్‌లో క్రూజర్ బైక్ అంటే మనకు గుర్తొచ్చేది బజాజ్ అవేంజర్. ఈ ఏడాది వచ్చిన కొత్త అవేంజర్ బాగా పాపులర్ అయ్యింది.

TNN 7 Nov 2017, 1:10 pm
భారత్‌లో క్రూజర్ బైక్ అంటే మనకు గుర్తొచ్చేది బజాజ్ అవేంజర్. ఈ ఏడాది వచ్చిన కొత్త అవేంజర్ బాగా పాపులర్ అయ్యింది. బజాజ్ అవేంజర్ 150 సీసీ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఇప్పుడు దీనికి పోటీగా జపాన్ దిగ్గజం సుజుకి కొత్త క్రూజర్ బైక్‌ను భారత్‌లో విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన తమ క్రూజర్ మోడల్ ఇంట్రూడర్‌ ఎం1800 పోలికలతో ఈ కొత్త బైక్‌ను రూపొందించింది. అయితే అది 1800 సీసీ ప్రీమియం క్రూజర్ బైక్. భారత మార్కెట్‌కు అనుగుణంగా 155 సీసీ ఇంజిన్‌తో కొత్త ఇంట్రూడర్ 150ని మంగళవారం సుజుకి విడుదల చేసింది. దీని ధర రూ.98,340 (ఢిల్లీ ఎక్స్-షోరూం).
Samayam Telugu suzuki intruder launched in indiam priced at rs 98340
బజాజ్ అవేంజర్‌కు పోటీగా సుజుకి ఇంట్రూడర్


సుజుకి నుంచి భారత్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న జిక్సర్‌లో వాడిన ఇంజిన్‌నే ఇంట్రూడర్‌లో కూడా వాడారు. ఆకర్షణీయమైన డిజైన్, కార్బోరేటర్‌తో కూడిన 155 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్, మోనో రేర్ సస్పెన్షన్, ప్రొజెక్టెడ్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్, స్పోర్టీ ట్విన్ సైలెన్సర్, యాంటీ లాకింగ్ బ్రేక్ సిస్టమ్ దీనిలో ప్రధాన ఆకర్షణ. ఈ బైక్‌కు అమర్చిన 155 సీసీ ఇంజిన్ 8000 ఆర్‌పీఎం వద్ద 14 బీహెచ్‌ పవర్‌ను, 6000 ఆర్పీఎం వద్ద 14 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుందని సుజుకి వెల్లడించింది. బైక్ బరువు 148 కేజీలని, అత్యధికంగా లీటరుకు 44 కి.మీ. మైలేజీని ఇస్తుందని తెలిపింది. తమ బైక్ బజాజ్ అవేంజర్‌కు గట్టి పోటీనిస్తుందని సుజుకి ఆశాభావం వ్యక్తం చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.