యాప్నగరం

కారు కొనుగోలుదారులకు ఇక చుక్కలే!

టాటా మోటార్స్ ధరల పెంపు నేపథ్యంలో హోండా కార్స్ కూడా వాహన ధరలను పెంచాలని భావిస్తోంది. దీంతో వచ్చే నెల నుంచి హోండా కార్ల ధర 1.2 శాతం మేర పెరిగే అవకాశముంది. ముడిపదార్ధాల వ్యయాల పెరుగుదల ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

Samayam Telugu 17 Jun 2019, 10:59 am

ప్రధానాంశాలు:

  • కార్ల ధరలు పెంచేస్తున్న కంపెనీలు
  • చడిచప్పుడు కాకుండా ధర పెంచేసిన టాటా మోటార్స్
  • వచ్చే నెల నుంచి పెరగనున్న హోండా కార్ల ధరలు

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu tata honda
కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. వాహన తయారీ కంపెనీలు కార్ల ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్ ఇప్పటికే సైలెంట్‌గా తన హారియర్ ఎస్‌యూవీ ధరను పెంచింది.
టాటా హారియర్ ధర ఏకంగా రూ.31,000 వరకు పెరిగింది. ధర పెరుగుదల వేరియంట్ ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. హారియర్ ధర పెరగడం ఇదే తొలిసారి. ఈ కారు ధర రూ.12.99 లక్షల నుంచి రూ.16.55 లక్షల శ్రేణిలో ఉంది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.

టాటా మోటార్స్ కారు ధర పెరుగుదల విషయాన్ని ప్రకటించలేదు. ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. టాటా హారియర్ ప్రధానంగా ఎక్స్ఈ, ఎక్స్ఎం, ఎక్స్‌టీ, ఎక్స్‌జెడ్ అనే నాలుగు వేరియంట్ల రూపంలో అందుబాటులో ఉంటుంది.

మరోవైపు హోండా కార్స్ కూడా వాహన ధరలను పెంచాలని భావిస్తోంది. దీంతో వచ్చే నెల నుంచి హోండా కార్ల ధర 1.2 శాతం మేర పెరిగే అవకాశముంది. ముడిపదార్ధాల వ్యయాల పెరుగుదల ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.